రాష్ట్రపతి పాలన: కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు కేంద్రానికి బుధవారం నోటీసులు పంపింది. జనవరి 29లోగా రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ అస్థిరత కారణంగా రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రపతికి తీర్మానం పంపగా ఆయన దానిపై వివరణ కోరారు. కేంద్రమంత్రుల వివరణతో సంతృప్తి చెందిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆరుణాచల్‌ప్రదేశ్‌ మంగళవారం నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

కాగా, రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఏ కారణాలతో రాష్ట్రపతి పాలన విధించారంటూ ప్రశ్నించింది. 29లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 Prez rule in Arunachal Pradesh- SC notice to centre, matter adjounred to Friday

అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తే.. డిసెంబర్ 16న అసెంబ్లీ స్పీకర్‌ నబమ్‌ రెబియాకు ‘ఉద్వాసన' పలికేందుకు 21 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. 11 మంది బిజెపి సభ్యులు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో చేతులు కలిపారు.

అసెంబ్లీ కాంప్లెక్స్‌కు స్థానిక పాలనా యంత్రాంగం సీలు వేయడంతో వీరంతా ఉప సభాపతి టి నోర్బు థోంగ్డోక్‌ అధ్యక్షతన ఒక కమ్యూనిటీ హాల్‌లో ‘అసెంబ్లీ సమావేశాల'ను నిర్వహించారు. స్పీకర్‌కు ‘ఉద్వాసన' పలుకుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

విపక్ష బిజెపి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ తిరుగుబాటు శాసనసభ్యులతో కలసి స్థానిక హోటల్‌లో సమావేశమై ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఆయన స్థానంలో కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే కలిఖో పుల్‌ను కొత్త ‘ముఖ్యమంత్రి'గా ఎన్నుకున్నారు. అయితే గువహటి హైకోర్టు జోక్యం చేసుకొని, తిరుగుబాటు శిబిరం తీసుకున్న నిర్ణయాలను నిలుపుదలలో పెట్టేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర నిర్ణయాన్ని రెబల్స్ వర్గం స్వాగతించింది. మద్దతు లేని నబంటుకి సీఎంగా కొనసాగే అర్హత లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+