నాన్ సబ్సిడీ వంటగ్యాస్ ధర భారీగా పెంపు
సబ్సిడీ యేతర ఎల్‌పిజి రేట్లు 86రూపాయలు పెరిగాయి. వినియోగదారుల కోటా పూర్తయిన తర్వాత సరఫరా చేసే అదనపు గ్యాస్ సిలెండర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా నాన్ సబ్సిడీ గ్యాస్ రేట్లన
హైదరాబాద్: సబ్సిడీ యేతర ఎల్‌పిజి రేట్లు 86రూపాయలు పెరిగాయి. వినియోగదారుల కోటా పూర్తయిన తర్వాత సరఫరా చేసే అదనపు గ్యాస్ సిలెండర్లకు కొత్త రేట్లు వర్తిస్తాయి. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా నాన్ సబ్సిడీ గ్యాస్ రేట్లను పెంచాల్సి వచ్చిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పిజి రేటు 737.50పైసల మేర ఉంది. దీనికి అదనంగా 86రూపాయలు చేరుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్‌పిజి సిలెండర్ రేట్లను బట్టి వీటి కొత్త ధర ఉంటుంది. సబ్సిడీపై గ్యాస్ పొందే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కోటా తీరిన వారికే ఈ పెంపుదల వర్తిస్తుందని ఐఓసి వివరించింది. కొత్త రేట్లు మార్చి 1 నుంచే అమలులోకి వచ్చాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications