బాలుడిపై రేప్, అసహజ శృంగారం: మతగురువు అరెస్టు
బాలుడిపై అత్యాచారం జరిగిన మతగురువును పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలో మతగురువు, ప్రిన్సిపాల్ బాలుడిపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడు.
కొచ్చి: ఓ బాలుడిపై అత్యాచారం చేసిన కేసులో కింగ్స్ డేవిడ్ స్కూల్ ప్రిన్సిపాల్, మతగురువు బాసిల్ కురియాకోస్ (65)ను కేరళ పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు. ఆయనపై ఐపిసి 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పదేళ్ల బాలుడితో అతను అసహజ శృంగారం జరిపినట్లు బాసిల్‌పై ఆరోపణలు వచ్చాయి.
హర్యానాలో పనిచేస్తున్న బాలుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టు 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. కున్నా తునాడ్ సమీపంలో గల కింగ్స్ డేవిడ్ స్కూల్‌కు బాసిల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు.

హాస్టల్‌లో ఉంటున్న బాలుడిపై ఆయన డిసెంబర్ 21వ తేదీ రాత్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హాస్టల్‌కు వచ్చిన తన సోదరుడితో ప్రిన్సిపాల్ చర్యల గురించి బాధిత బాలుడు చెప్పాడు. దీంతో ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications