పూజారి చేతిలో సీఎం కొరడా దెబ్బలు.. ఇదేం సెంటిమెంట్ అంటూ..

ఆయనో సీఎం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. ఔను మీరు విన్నది నిజమే.. ఎవరి చేతుల్లో కాదు పూజారి చేతుల్లో.. ఒకటి కాదు రెండు కాదు ఆరు కొరడా దెబ్బలు తిన్నారు. ఈ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. సీఎం ఏంటీ కొరడా దెబ్బలు తినడం ఏంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఛత్తీ‌స్‌గఢ్ సీఎం భూపేష్ భగాల్.. సీఎంకు సెంటిమెంట్లు ఎక్కువే. ఆలయాలకు వెళ్లడమే కాదు ఆచారాలు పాటిస్తారు కూడా. పురాతన ఆలయాలను దర్శించుకోవడం.. వాటి విశిష్టత తెలుసుకోవడం అంటే ఆయనకు ఇష్టం. అలాగే మంగళవారం రాయ్‌పూర్‌లోని ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడే విచిత్ర ఘటన జరిగింది. దీనిని చూసిన సిబ్బంది, అధికారులు కూడా విస్తుపోయారని తెలుస్తోంది.

Priest whip lash by Chhattisgarh cm Bhupesh Baghel

రాయ్‌పూర్‌లోని ఆలయానికి వచ్చిన సీఎం దర్శించుకునే ముందు ఆచార వ్యవహారాలు తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చిన వారు కొరడా దెబ్బలు తినాలనే సంగతి తెలుసుకున్నారు. అయితే ఇదీ గోవర్థన్ సంప్రదాయం ప్రకారం జరిగే క్రతువు. తాను కూడా విశ్వసించి కొరడా దెబ్బలు తినాలని నిర్ణయించుకున్నారు. పూజారి చేతిలో ఆరు కొరడా దెబ్బలు తిన్నారు. ఆరు కొరడా దెబ్బల తర్వాత ఆచారం పూర్తయింది. తర్వాత పూజారి సీఎం భూపేష్‌ను ఆలింగనం చేసుకున్నారు. సీఎం పేరుతో పూజలు చేసి.. ఆలయ తీర్థప్రసాదాలను అందజేశారు.

ఏదీ ఏమైనా సీఎం కొరడా దెబ్బలు తిన్నారనే వార్త తెలిసి జనం నోరెళ్లబెట్టారు. సీఎం కొరడా దెబ్బలు తినడం ఏంటీ అని ఆశ్చర్యపోయారు. తప్పు చేసిన వారిని దండించాల్సిన సీఎం.. ఏకంగా పూజారి చేతిలో ఆచార సాంప్రదాయాల ప్రకారం కొరడా దెబ్బలు తినడం సర్వత్రా చర్చానీయాంశమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+