కర్ణాటక బంద్: బెంగళూరు ఇంత ఖాళీగా... (పిక్చర్స్)
బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేసిన నేపధ్యంలో కర్ఱాటక ప్రజలు మండిపడుతున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చెయ్యరాదని పలు కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గురువారం వరకు 1,200 కన్నడ సంఘాలు కర్ణాటక బంద్ కు మద్దతు ఇచ్చాయి. అయితే గురువారం రాత్రి కర్ణాటకలోని అన్ని సంఘ, సంస్థలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. శుక్రవారం వేకువ జామున నుంచి బంద్ కొనసాగుతున్నది.

క్యాబ్ డ్రైవర్లను చితకబాదేశారు
బస్సులు లేకపోవడంతో కొందరు ట్యాక్సీ డ్రైవర్లు చేతివాటం చూపించడానికి ప్రయత్నించారు. మెజస్టిక్, సిల్క్ బోర్డు, మారతహళ్ళి, హెబ్బాళ, టిన్ ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ప్రయాణికులను పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించిన క్యాబ్ డ్రైవర్లను చితకబాదేశారు.

బెంగళూరు సిటి బస్సులకు బ్రేక్
బీఎంటీసీ బస్సు సర్వీసులు లేకపోవడంతో మెజస్టిక్, సిటి మార్కెట్, శివాజీనగర్, యశవంతపుర, బనశంకరి, ఎలక్ట్రానిక్ సిటి తదితర ప్రాంతాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

ముందే చెప్పాం ఎందుకు వచ్చారు
ఈనెల 9వ తేది శుక్రవారం కర్ణాటక బంద్ ఉంటుందని ముందే చెప్పామని, అయితే పోరుగు రాష్ట్రాల వారు ఎందుకు వచ్చారని పలు కన్నడ సంఘాల నాయకులు ప్రయాణికులను ప్రశ్నించారు.

చిన్న చిన్న సందులు వదల్లేదు
చిన్నచిన్న సందులలో ఉన్న నిత్యవసర వస్తువుల దుకాణాలు తీసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే షాపులు మూసివేయాలని హెచ్చరించారు.

కార్లు, బైక్ లను వదిలి పెట్టలేదు
బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల సమయంలో కన్నడ సంఘాల కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు. కార్లు, ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లడానికి వీలులేదని అడ్డుకున్నారు.

పెట్రోల్ బంకుల దగ్గర క్యూ
బెంగళూరు నగరంతో పాటు పలు జిల్లాలో శుక్రవారం వేకువ జామున పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పెట్రోల్, డీజల్ నింపడానికి సిబ్బంది నిరాకరించడంతో వాదోపవాదాలు జరిగాయి.

విద్యాసంస్థలు
కర్ణాటకలో అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఐటీ, బీటీ, కార్పొరేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. జనసంచారం లేకపోవడంతో రోడ్లు బోసిపోయాయి.

హోటల్స్ బంద్
బెంగళూరు నగరంలో అన్ని హోటల్స్ మూసివేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆహారం అందక అవస్థలు పడ్డారు.












Click it and Unblock the Notifications