Train accident: ట్రైన్ కప్లింగ్ యాక్సిండెంట్‌పై ప్రాథమిక రిపోర్ట్.. ఆ తప్పిదమే పాయింట్‌మెన్ ప్రాణం తీసింది
Bihar train coupling accident: ఈమధ్య దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఏదో ఒకచోట నిత్యం దీని గురించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఇటీవల బీహార్‌లో జరిగిన ఘటన మాత్రం దారుణమనే చెప్పాలి. ఇంజన్ కంప్లింగ్ సమయంలో ఓ రైల్వే ఉద్యోగి నలిగిపోయి మరణించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ప్రమాదానికి కారణాన్ని తెలియజేశారు.
బీహార్‌లోని బరౌనీ జంక్షన్‌లో షంటింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు రైల్వే ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో వారిలో ఒకరు ఇంజన్ మరియు పవర్ కారు బఫర్‌లలో ఇరుక్కుని శనివారం మరణించినట్లు నివేదిక పేర్కొంది. ఐదుగురు రైల్వే అధికారులు సంతకం చేసిన ఉమ్మడి రిపోర్టులో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

నివేదిక ప్రకారం.. అమర్ కుమార్ మరియు మహ్మద్ సులేమాన్ అనే ఇద్దరు పాయింట్‌మెన్లు కప్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. లోకో డ్రైవర్‌కు సులేమాన్ తప్పుడు సంకేతం ఇచ్చాడు. ఫలితంగా అమర్ కుమార్ శరీరం బఫర్‌ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనకు సులేమాన్ బాధ్యుడిగా ప్రాథమిక నివేదిక తెలిపింది.
అయితే సులేమాన్ మాత్రం తనను తాను సమర్థించుకున్నాడు. ప్రమాదానికి లోకో డ్రైవర్ బాధ్యుడు అంటూ వ్రాతపూర్వక స్టేట్‌మెంట్ సమర్పించాడు. ఇంజన్ పవర్ కారు నుంచి కొంచెం దూరంగా వెళ్లిందని, అమర్ కుమార్ బఫర్ కప్లర్‌ను మూసివేయడానికి వెళ్ళినప్పుడు డ్రైవర్ కు తాను ఎటువంటి హ్యాండ్ సిగ్నల్ ఇవ్వలేదన్నాడు. అయినప్పటికీ లోకో డ్రైవర్ ఇంజిన్‌ను రివర్స్ చేసినట్లు ఆరోపించాడు.












Click it and Unblock the Notifications