Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఊబకాయంపై పోరు మొదలెట్టిన ప్రధాని మోదీ... ప్రముఖులు నామినేట్!

ఊబకాయం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఇక ఊబకాయంపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధాని మోదీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉద్యమాన్ని విస్తరించాలని మీరు ఒక్కొక్కరు పదిమందిని నామినేట్ చేయాలని ఆయన వారిని కోరారు.

ఊబకాయంపైప్రధాని మోదీ
దేశంలో ఊబకాయం అతి తీవ్రమైన సమస్యగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేసిన మోదీ నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయాన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆహారంలో తక్కువ నూనె వాడాలని, నూనె వాడకాన్ని 10% తగ్గించడంతోపాటు ఈ ఛాలెంజ్ ను మరో పది మందికి అందించాలని సూచించారు.
2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టుగా WHO డేటా వెల్లడించిందన్నారు.

Prime Minister Modi launches fight against obesity Celebrities nominated

ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధాని మోదీ
ఇది చాలా తీవ్రమైన హెల్త్ ఎమర్జెన్సీ అని పేర్కొన్న మోదీ ఊబకాయం అనేక రకాల సమస్యలకు వ్యాధులకు దారితీస్తుంది అన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ ను షేర్ చేసిన మోదీ ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించడం పై అవగాహన విస్తృతం చేయడానికి, తన క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నానని కొందరు ప్రముఖులను నామినేట్ చేశారు.

ప్రధాని నామినేట్ చేసింది వీరినే
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహేంద్ర, ప్రముఖ నటుడు మోహన్ లాల్, భోజ్ పురి గాయకుడు నటుడు నిరాహువా హిందుస్తానీ, షూటింగ్ ఛాంపియన్ ఒలంపిక్ విజేత మను భకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని, గాయని శ్రేయ ఘోషల్, ఎంపీ రచయిత్రి సుధా మూర్తి, నటుడు ఆర్ మాధవన్ లను ప్రధాని మోదీ నామినేట్ చేశారు.

ఊబకాయం తగ్గించేందుకు ఉద్యమం మొదలవుతుందా?
వీరు ఒక్కొక్కరు పదిమందిని నామినేట్ చేయాలని ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా ముందుకు సాగాలని మోదీ ఆకాంక్షించారు. మరి ప్రధాని మోదీ కోరినట్టు ఊబకాయం తగ్గించేందుకు ఉద్యమం మొదలవుతుందా.. ఏ మేరకు ఇది సత్ఫలితాలను ఇస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+