కెనడాలోని హిందూ దేవాలయంపై దాడి.. ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..!

కెనడాలోని ఖలిస్థానీ మద్దతు దారులు మరోసారి రెచ్చిపోయారు.సోమవారం కెనడాలోని హిందూ భక్తులపై ఖలిస్థానీ గ్రూప్‌కు చెందిన పలువురు సోమవారం దాడికి పాల్పడ్డారు.బ్రాంఫ్టన్ నగరంలోని హిందూ మహాసభ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. టెంపుల్ ఆవరణలోకి చొరబడి భక్తులపై కర్రలతో విరుచుకుపడ్డారు. హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్థానీలు దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహిళలు, పిల్లలపై కూడా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడి సమయంలో నిందితులు వారి చేతుల్లో ఖలిస్థానీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఉద్రిక్తతలు పెరగకుండా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిరసన తెలుపుతున్న ఖలిస్థానీలు ఆలయానికి చేరుకుని ప్రజలపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. దేశంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు లేదని, ప్రతి దేశ పౌరుడు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని తెలిపారు.

Prime Minister Modi s reaction on Attack on a Hindu temple in Canada

ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను ట్రూడో ఆదేశించారు. కెనడాలోని హిందూ భక్తులపై జరిగిన దాడిపై దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించే పిరికి ప్రయత్నాలూ అంతే భయంకరమైనవి. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ స్థైర్యాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది మరియు చట్ట నియమాన్ని సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నాము'' అంటూ మోదీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+