సుస్వాగతం: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోడీ (పిక్చర్స్)

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం మద్యాహ్నం 2.30 గంటల సమయంలో నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాల, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు నరేంద్ర మోడికి ఘనంగా స్వాగతం పలికారు.

నరేంద్ర మోడి రాక సందర్బంగా పాత ఎయిర్ పోర్టు రోడ్డు నుండి రాజ్ భవన్ వరకు వాహనాల రాకపోకలనునిషేదించారు. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాత ఎయిర్ పోర్టు రోడ్డు మీదుగా రాజ్ భవన్ చేరుకున్నారు.

ఆ సమయంలో రోడ్లుకు ఇరువైపుల బెంగళూరు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులతో సంప్రదించి భద్రతా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

నమస్కరిస్తున్న ప్రధాని

నమస్కరిస్తున్న ప్రధాని

గురువారం మద్యాహ్నం ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకున్నారు.

సుస్వాగతం

సుస్వాగతం

బెంగళూరు విచ్చేసిన ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న గవర్నర్ వాజుబాయ్ వాల, ముఖ్యమంత్రి సిద్దరామయ్య.

వెల్ కం టు బెంగళూరు

వెల్ కం టు బెంగళూరు

నరేంద్ర మోడీకి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాల

ఎలా ఉన్నారు.. సిద్దరామయ్య

ఎలా ఉన్నారు.. సిద్దరామయ్య

నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య. అంతా కుశలమే కదా సిద్దరామయ్యా.. అంటూ చిరునవ్వులు చిందిస్తున్న నరేంద్ర మోడీ

రండి సార్

రండి సార్

రాజ్ భవన్ చేరుకున్న నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతున్న రాజ్ భవన్ సిబ్బంది. రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకున్న నరేంద్ర మోడీ తర్వాత లలిత్ అశోక్ హోటల్‌కు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+