ట్విట్టర్ వివాదంలో ప్రధాని మోడీ: 'ఓ మహిళ అయినప్పటికీ'
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను పొగుడుతూ, భారత ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పెను దుమారాన్ని సృష్టించింది. ఆదివారం నాడు ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో ఢాకా యూనివర్సిటీలో ప్రసంగించారు.

ఈ ప్రసంగంలో ప్రధాని మోడీ ఉగ్రవాదపై షేక్ హసీనా చేస్తున్న పోరును కొనియాడుతూ 'ఓ మహిళ అయినప్పటికీ' అని ప్రస్తావించారు. దీనిపై భారత్‌లోని మహిళా సంఘాలు, ప్రముఖులు మోడీ వ్యాఖ్యలను తప్పబడుతున్నారు.
भारत और बांग्लादेश पास-पास भी हैं और अब साथ-साथ भी…great atmosphere at Dhaka University. Sharing my speech.http://t.co/Z0Rqrybfhv
— Narendra Modi (@narendramodi) June 7, 2015 Terrorism has no boundaries. India has been troubled by it for years. What did people associated with terrorism gain: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 7, 2015 ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు మహిళలను ఆగౌరవపరచడమేనని, ఆర్‌ఎస్ఎస్ భావజాలం తనలో ఇంకా మిగిలే ఉందని పలువురు ట్విట్టర్ ఖాతాదారులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రాణా అయూబ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా తదితరులు మోడీకి వ్యతిరేకంగా ట్వీట్స్ చేశారు.
At core, RSS/BJP are misogynistic, bigoted, chauvinistic and sexist. Narendra Modi is just another manifestation of it. #DespiteBeingAWoman
— Sanjay Jha (@JhaSanjay) June 8, 2015 Hahaha-No #DespiteBeingAWoman for us-secretly we are all men-just carefully shave our moustaches off every morning:) https://t.co/RrD238QA16
— Twinkle Khanna (@mrsfunnybones) June 8, 2015 











Click it and Unblock the Notifications