మోదీ గారు, మీకు, కర్ణాటక ఎన్నికలకు ఏమిటి సంబంధం ?, రాహుల్ గాంధీ సూటిప్రశ్న !

బెంగళూరు/తుమకూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో కథ రసవత్తరంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు, ప్రధాని నరేంద్ర మోదీకి ఏమిటి సంబంధం అంటూ యువరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ గారు, మీకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ రాహు గాంధీ ప్రధానిని ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నరేంద్ర మోదీ గారు మా గురించి (కాంగ్రెస్) మాట్లాడే బదులు కేంద్రంలోని ఆయన ప్రభుత్వం, కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుంటుందని రాహుల్ గాంధీ ప్రధానికి సూచించారు.

కర్ణాటకకు వస్తున్న మీరు మీ ప్రభుత్వాల పనితీరు గురించి మాట్లాడకుండా పదేపదే కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను 91 సార్లు దూషించారని పదేపదే చెప్పుకుంటూ వెలుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కర్ణాటకలో గత మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడింది అని మీరు చెబితే వినాలని ఉందని రాహుల్ గాంధీ ప్రధాని మోదీని వ్యంగంగా ప్రశ్నించారు.

 rahulmodi

కర్ణాటకలో మీరు అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. విద్యారంగానికి ఏం చేస్తారు. వైద్య రంగానికి, పేదలకు ఎలాంటి సేవలు చేస్తారు అని చెప్పాలని, అవినీతిని అరికట్టడానికి ఏం చేస్తారో చెబితే బాగుంటుందని, అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పిన సోదే చెప్పుకుంటూ వెలుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

కర్ణాటకకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే మా పార్టీ నాయకులు సిద్దరామయ్య, డీకే శివకుమార్ తదితరుల మీద విమర్శలు చేస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకకు వచ్చి మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప, సిట్టింగ్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ను అక్కడక్కడ పొగుడుతూ కాలం గడిపేసి కర్ణాటకను వదిలి వెళ్లిపోతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

కర్ణాటకలో జరుగుతున్నది అసెంబ్లీ ఎన్నికలని, అది కర్ణాటక ప్రజలకు సంబంధించిన విషయం అని ప్రధాని మోదీ వన్ మ్యాన్ షో ఎన్నికలు కాదని యువరాజు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శనివారం, ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తనను విషసర్పంతో పోల్చారని విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+