మోదీతో పక్కాప్లాన్ చేస్తున్న లీడర్స్, 20 ర్యాలీల్లో ప్రధాని ప్రసంగం, పిన్ టూ పిన్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీతో 20 ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న కర్ణాటక బీజేపీ నాయకులు హైకమాండ్ దగ్గర మార్క్ లు కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, సినీ తారలు ఎన్నికల ప్రచారం చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కర్ణాటకలో మరోసారి అధికారం లక్షంగా పెట్టుకున్న బీజేపీ నాయకులు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని పక్కాప్లాన్ చేస్తున్నారు.

ఈ స్కెచ్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 20 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించడానికి ప్లాన్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు గురించి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ 20 బహిరంగ సభల్లో పిన్ టూ పిన్ వివరిస్తారని అన్నారు.
ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీలోని ప్రముఖుల పేర్లు విడుదల చేసిన బీజేపీ నాయకులు వారితో బహిరంగ సభల్లో మాట్లాడించి ఓటర్లను ఆకర్షించాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న నాయకుల జాబితాలో కర్ణాటక మాజీ సీఎంలు బీఎస్. యడియూరప్ప, డీవీ. సదానంద గౌడల పేర్లు కూడా ఉన్నాయి.

మే 4వ తేదీన ఉడిపిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ఇదే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి దీటుగా భారీ బహిరంగ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు పక్కాప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications