దళపతుల అడ్డాలో మోదీ ఎంట్రీ, మాజీ ప్రధాని, మాజీ సీఎంకు షాక్ మీద షాక్, కథ !
బెంగళూరు/రామనగర్: ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ ఫోకస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మీద పెట్టారు. దళపతుల అడ్డాలో అడుగుపెట్టి సత్తా చాటుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్దం అయ్యారు. మాజీ ప్రధాని, మాజీ సీఎం ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభలో ప్రసగించడానికి సిద్దం అయ్యారు.
జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి కలిసి జేడీఎస్ పార్టీకి కంచుకోటలు, కార్యకర్తలను కవచాలుగా ఏర్పాటు చేసుకున్నారు. పాత మైసూరు జిల్లాలతో పాటు హాసన్ తదితర జిల్లాల్లో వారికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాధించుకున్నారు.
ఒక్కలిగులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో జేడీఎస్ పార్టీ తరువాత ఏ పార్టీ అయినా అక్కడ చలామణి అవుతుంది. అలాంటి ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దళపతులు, ఒక్కలిగుల అడ్డాలో ప్రచారం చేసి బీజేపీ విజయం కోసం పని చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ ప్రాంతంలో జరిగే బహిరంగ సభకు హాజరుకావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రామనగర జిల్లాలోని చెన్నపట్టణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి, బీజేపీ నేత యోగీశ్వర్ కూడా పోటీ చేస్తున్నారు. బీజేపీ నాయకుడు యోగీశ్వర్ కు మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో ఆయన్ను గెలిపించాలని ఇప్పటకే బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
మాజీ మంత్రి యోగీశ్వర్ విజయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈనెల 30వ తేదీన చెన్నపట్టణలో జరిగే ర్యాలీలో, భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటున్నారు. జేడీఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి అని కొంతకాలం వేచి చూడాలని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications