ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఎంత జీతం తీసుకుంటారో తెలుసా?
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించడంతో 9వ తేదీ సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోడీ సమం చేశారు. దేశవ్యాప్తంగా అందరూ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఎంత జీతం తీసుకుంటారు? ఆయన సంపాదన ఎంత ఉంటుంది? అనే విషయాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
పెరిగిన రాష్ట్రపతి వేతనం
నరేంద్రమోడీ నెలకు రూ.1.66 లక్షల వేతనం తీసుకుంటారు. భద్రత చాలా పటిష్టంగా ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నకు చెందిన దళాలు ఆయనకు భద్రత కల్పిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యేకంగా ఓ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులో ఉంటుంది. అధికారికంగా రేస్ కోర్స్ రోడ్ లో నివసిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేతనం నెలకు రూ.5 లక్షలు. గతంలో రాష్ట్రపతికి రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2018లో వేతనాన్ని పెంచారు. రాష్ట్రపతికి హోదాకు తగినట్లుగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. దేశంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వైద్యం కూడా ఉచితంగానే అందుతుంది. ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు ల్యాండ్ ఫోన్లతోపాటు ఓ మొబైల్ ఫోన్, ఐదురుగు వ్యక్తిగత సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుంది.

పెరిగిన ఉప రాష్ట్రపతి వేతనం
ఉప రాష్ట్రపతి వేతనం కూడా తక్కువగానే ఉండేది. దాన్ని కూడా 2018లో పెంచారు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ వేతనాల పెంపు జరిగింది. రూ.1.25 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచారు. ల్యాండ్ ఫోన్ తోపాటు మొబైల్ కూడా ఉచితంగా ఇస్తారు. తాజాగా వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మెజారిటీకి 272 సీట్లు అవసరం కాగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) 293 సీట్లు దక్కించుకుంది. ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతాపార్టీకి 240 సీట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications