టైం మ్యాగజైన్‌లో చోటు సంపాదించుకున్న సర్థార్ పటేల్ విగ్రహం, విగ్రహాన్ని సందర్శించాలని ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లో సర్థార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించిన అతిపెద్ద సర్థార్ పటేల్ విగ్రహానికి టైమ్ మ్యాగజైన్‌లో చోటు దక్కింది. టైం మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని వంద విజిటింగ్ ప్రాంతాల్లో సర్థార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. సర్ధార్ పటేల్ విగ్రహాన్ని ప్రజలు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. దీంతో గతంలో ఎప్పుడు లేనట్టుగా సర్థార్ సరోవర్ డ్యామ్ వద్ద 134 మీటర్ల వరకు నీటీ ప్రవాహం కొనసాగుతుందని అన్నారు.
గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లో 182 మీటర్ల అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించి ప్రారంభించిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఆప్రాంతం పర్యటక ప్రదేశంగా విలసిల్లుతోంది. రోజురోజుకు విగ్రహాన్ని వీక్షించే పర్యాటకులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని టూరిస్టు ప్రాంతాల జాబితా రూపోందించే టైం మ్యాగజైన్ లో సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడ చోటు సంపాదించుకుంది. దీంతో ప్రధాని మోడీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరు ఈ విగ్రహాన్ని చూసేందుకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఒక్కరోజే 34వేల మంది టూరిస్టులు వచ్చారని తెలిపారు.

కాగా ప్రతి సంవత్సరం రెండుకోట్ల మంది భారతీయులు వివిధ దేశాలను పర్యటిస్తారని అయితే.. భారత దేశంలో ఉన్న 15 ముఖ్యప్రదేశాలను కూడ వారు సందర్శించాలని ఆయన మోడీ తన ఇండిపెండెంట్ రోజున ఇచ్చే ప్రసంగంలో కోరారు. అప్పుడే దేశీయ టూరిజం నిలదొక్కుకుంటుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు టూరిజంలో భాగంగా కనీసం సరైన హోటళ్లు కూడ లేవని చెప్పిన ఆయన టూరిస్టూలు సందర్శన మొదలైతే సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications