మోడీ విదేశీ టూర్లు ఇలా: మరోసారి రెడీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు మళ్లీ రంగం సిద్దం అయ్యింది. ఈనెల 21 తేది నుంచి ఐదు రోజుల పాటు నరేంద్ర మోడీ మలేషియా, సింగపూర్ దేశాలలో పర్యటించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇదే నెల బ్రిటన్, టర్కీ దేశాలలో పర్యటన ముగించుకుని మంగళవారం భారత్ లో అడుగు పెట్టిన నరేంద్ర మోడీ మళ్లి విదేశాలకు వెళుతున్నారు. ఈనెల 21వ తేది శనివారం నరేంద్ర మోడీ మలేషియా బయలుదేరి వెళుతున్నారు.
2014 మే 26వ తేదిన భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు దాదాపు 30 దేశాల్లో పర్యటించారు. ఇప్పటి వరకు 79 రోజులు విదేశాలలో గడిపారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా మోడీ మాత్రం ఆయన అనుకున్నది చేసుకుంటూ వెలుతున్నారు.

భూటన్ లో మొదటి అడుగు
ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ భూటాన్ లో మొదట పర్యటించారు. జూన్ 16,17 భూటాన్, జులై 13 నుంచి 16 వరకు బ్రెజిల్, ఆగస్టు 3,4 తేదీలలో నేపాల్ లో పర్యటించారు

జపాన్ పర్యటన
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు నరేంద్ర మోడీ జపాన్ లో పర్యటించారు.

అమెరికాలో
సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు అమెరికా, నబంబర్ 11 నుంచి 14 వరకు మయన్మార్, నవంబర్ 14 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, నవంబర్ 19 ఫిజి, నవంబర్ 25 నుంచి 27 వరకు నేపాల్ లో పర్యటించారు.

2015 శుభారంభం
మార్చి 10,11 సీషెల్స్, మార్చి 11,12 మారిషస్, మార్చి 13,14 శ్రీలంక, మార్చి 29 సింగపూర్ లో పర్యటించారు.

ఫ్రాన్స్, జర్మనీ, కెనడా
ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫ్రాన్స్, ఏప్రిల్ 12 నుంచి 14 వరకు జర్మనీ, ఏప్రిల్ 14 నుంచి 16 వరకు కెనడా పర్యటన.

చైనా టూ బంగ్లాదేశ్
మే 14 నుంచి 16 వరకు చైనా, 16, 17 మంగోలియా, మే 18,19 దక్షిణ కొరియా, జూన్ 6 ,7 బంగ్లాదేశ్ పర్యటన.

మోడీ విదేశీ టూర్లు ఇలా: మరోసారి రెడీ (ఫోటోలు)
జులై 6 ఉజ్జకిస్థాన్, జులై 7 కజకిస్థాన్, జులై 8 నుంచి 10 వరకు రష్యా, జులై 11,12 తుర్క్మెనిస్థాన్, జులై 12 కర్గిజస్థాన్, జులై 12,13 తజకిస్థాన్ లో పర్యటన.

అరబ్ లో పర్యటన
ఆగస్టు 16,17 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెప్టెంబర్ 23 ఐర్లాండ్, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు అమెరికా పర్యటన.

ఇదే నెలలో
నవంబర్ 12 నుంచి 14 వరకు బ్రిటన్, నవంబర్ 15,16 టర్కీ దేశాలలో పర్యటన. అదే విదంగా నవంబర్ 21 నుంచి 25వతేది వరకు మలేషియా, సింగపూర్ దేశాలలో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications