బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దానికి రాహుల్ గాంధీ కార్యాలయం కూడా ధన్యవాదాలు తెలిపింది.
Wishing the Congress Vice President, Shri Rahul Gandhi a Happy Birthday. I pray for his good health & long life. @OfficeOfRG
— Narendra Modi (@narendramodi) June 19, 2015 రాహుల్ గాంధీ పుట్టిన రోజు జూన్ 19 తేదీ. ఆయన 1975లో జన్మించారు. ఆయన వయస్సు ప్రస్తుతం 45. 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందించారు.

'కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలి' అని మోడీ ట్వీట్ చేశారు.
దీనికి రాహుల్ గాంధీ కార్యాలయం స్పందించింది. శుభాకాంక్షలు తెలిపిన మోడీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.
కాగా, చాలా ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలో పుట్టిన రోజు వేడుకల నాడు ఉన్నారు. అతని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నీ సిద్ధం చేశారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్‌కు కూడా మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications