మహిళా లెక్చరర్ జుట్టు పట్టి లాగి కొట్టిన తోటి లెక్చరర్ (వీడియో)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు లెక్చరర్లు కొట్టుకున్నారు. ఒక మహిళా లెక్చరర్‌ను జుట్టు పట్టుకుని తోటి లెక్చరర్ కొట్లాడు. కాలేజీలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్టుకునే వరకు వచ్చింది. మహిళా అని చూడకుండా మరో లెక్చరర్ ఆమెను జుట్టు పట్టుకుని కొట్టాడు.
అదే సమయంలో తోటి లెక్చరర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నెలలుగా తనకు జీతం ఇవ్వడంలేదని మహిళా లెక్చరర్ పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరువురు లెక్చరర్ల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.
నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్

ఢిల్లీలోని ఓ స్కూల్ ప్రిన్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టయ్యాడు. అవినీతి నిరోదక శాఖ అధికారులు సోమవారం అతనిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా వెల్లడించారు.
ప్రభుత్వ బాయ్స్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్‌ను అధికారులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ విద్యార్థుల వెల్ ఫేర్ ఫండ్‌కు చెందిన 27 లక్షల రూపాయలకు పైగా మొత్తాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications