ఆశ్చర్యం: సీపీఐ పోస్టర్‌పై కన్నుగీటుతున్న ప్రియా వారియర్
తిరువనంతపురం: మలయాళ ఒరు ఆదార్ లవ్ చిత్రంలో కన్నుగీటి నెటిజన్లను, యువతను తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ఫోటో కేరళలో సీపీఐ పోస్టర్ పైన కనిపించింది.
సినిమాలో కన్ను కొట్టడంతో పాటు తన హావభావాలతో ఆమె అందరి మదిని దోచుకున్నారు. ఆమె ఫోటో ఇప్పుడు సీపీఐ పోస్టర్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

కేరళలోని మలప్పురంలో ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్ర కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ప్రచారం నిమిత్తం దీనికి సంబంధించి పోస్టర్లను తయారు చేశారు.
ఈ పోస్టర్‌ను ఒరు ఆదార్ లవ్ చిత్రం పోస్టర్ మాదిరిగా డిజైన్ చేశారు. అందులో ప్రియా ఫోటోను ఉంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్ అతికించారు. సీపీఐకి చెందిన యూత్ వింగ్ ఏఐఎస్ఎఫ్ ఈ పోస్టర్ తయారు చేయించింది.












Click it and Unblock the Notifications