గే భర్త వేధింపులకు ఆత్మహత్య: ప్రియా వేది చివరి కాల్ తండ్రికే

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుడైన భర్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఎయిమ్స్ వైద్యురాలు ప్రియా వేది తన చివరి కాల్ తండ్రి రామ్ బాబు వర్మకే చేసినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో కుట్టుపని చేసే 55 ఏళ్ల రామ్ బాబు వర్మ తన కూతురును కాపాడుకునేందుకు హుటాహుటిన ఢిల్లీకి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

తన కూతురి వెంట ప్రతిక్షణం ఉన్న ఆయన చివరి నిమిషంలో మాత్రం ఆదుకోలేకపోయాడు. అతను ఢిల్లీలోని ప్రహార్ గంజ్ హోటల్‌కు చేరుకునే లోపలే కూతురు ప్రియా వేది తుది శ్వాస విడిచింది.

Priya Vedi's last call to her father

తాను తీవ్రమైన చర్యకు పాల్పడుతున్నట్లు ప్రియా వేది తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను ఢిల్లీకి బయలుదేరి వచ్చాడు. కానీ ఆమెను రక్షించుకోలేకపోయాడు. ఆదివారం సాయంత్రం తన కూతురి మృతదేహాన్ని తీసుకునే సమయంలో అతను కంటికీ మింటికీ ఏకధారగా విలపించాడు.

తన కూతురు డాక్టర్ కావడంతో డాక్టర్‌నే భర్తగా ఎంపిక చేయాలని ఆయన అనుకున్నాడు. ముగ్గురు డాక్టర్లను కాదనుకున్న తర్వాత కమల్ వేదీతో పెళ్లి నిశ్చయించాడు. ఒకే గదిలో ఉంటూ కూడా రామ్ బాబు వర్మ కుటుంబంలోని ముగ్గురు పిల్లలు కూడా బాగా చుదువుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ కాగా, చివరి కుమారుడు బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్. తన కూతుకు వైద్యురాలు కావడం పట్ల అతను ఎంతగానో గర్వించేవాడు.

కమల్ వేదీని పోలీసులు అరెస్టు చేసి సోమవారం జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అతని ల్యాప్‌టాప్‌ు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రియా వేది ఈ మెయిల్ ఖాతాను, సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొఫైల్స్‌ను చూడడానికి ఆమె పాస్‌వర్డ్స్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+