ఛీ: మోడల్ ఘాతుకం: అవ్వాతాతల్ని సజీవదహనం చేసే యత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

మైసూరు: తన బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యడానికి అవ్వా తాత అడ్డుపడుతున్నారని రెచ్చిపోయిన మనవరాలు దారుణంగా ప్రవర్తించింది. అవ్వాతాతల్ని సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించి ఇప్పుడు మాయం అయ్యింది.

మైసూరులోని లక్ష్మికాంత నగర మొదటి స్టేజ్ లో సోమసుందర్, లీలావతి అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మనవరాలు ప్రియదర్శిని (22). సోమసుందర్, లీలావతి దంపతుల కుమార్తె కు ఏకైక సంతానం ప్రియదర్శిని.

Priyadarshini- A 22 year old girl set fire to home to kill grand parents in Mysuru

ప్రియదర్శిని మోడల్ గా పని చేసింది. ప్రియదర్శిని తల్లిదండ్రలు విడాకులు తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రియదర్శిని తల్లి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ప్రయదర్శిని అవ్వాతాతల దగ్గర ఉంటున్నది.

గత సంవత్సరం నుంచి ప్రతి నిత్యం ప్రియదర్శిని అవ్వాతాతల్ని దారుణంగా కొడుతున్నదని తెలిసింది. అయితే ఈ వయస్సులో సొంత ఇంటిని విడిచి పెట్టి బయటకు వెళ్లి జీవించలేమని ఆ వృద్ద దంపతులు ఓర్చుకుని కాలం గడుపుతున్నారు.

గురువారం మద్యాహ్నం ప్రియదర్శిని దారుణానికి తెగించింది. అవ్వాతాతల్ని గదిలో బంధించి ఇంటికి నిప్పుపెట్టి పజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించింది. విషయం బయటకు తెలిసే లోపు అక్కడి నుంచి బాయ్ ఫ్రెండ్ తో మాయం అయ్యింది.

వృద్ద దంపతులు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపోరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఇరుగుపోరుగు వారు వచ్చి మంటలు అదుపు చేశారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. వృద్ద దంపతులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారని మైసూరులోని హెబ్బాళ పోలీసులు తెలిపారు.

ప్రతి రోజు ప్రయదర్శిని అర్ధనగ్నంగా ఈ ప్రాంతంలో తిరుగుతుందని, మద్యం, డ్రగ్స్ సేవించి ఎప్పుడు పడితే అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ను తీసుకువచ్చి అవ్వాతాతల్ని చితకబాదుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాయం అయిన ప్రియదర్శిని కోసం మైసూరు పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Priyadarshini- A 22 year old girl set fire to home to kill grand parents in Lakshmikanth nagar, Mysuru.
Please Wait while comments are loading...