ప్రియాకంచోప్రా నెక్లెస్ ఖరీదు రూ.204 కోట్లు
అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక మెట్ గాలా లో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు. నలుపు, తెలుపు రంగు గౌనుకు జతగా.. మెడలో వజ్రాల నెక్లెస్‌తో ఈ బాలీవుడ్ భామ ఎర్రతివాచీపై మిలమిల మెరిసిపోయింది. ఆ నెక్లెస్ ఎంత ఖరీదైందో తెలిస్తే వావ్ అనాల్సిందే..! అవును మరి.. ప్రియాంక చోప్రా
ధరించిన వజ్రాల హారం ధర ఏకంగా రూ.204 కోట్లకు పైనే ఉంటుంది..!
రూ.204 కోట్లకు పైనే:ఇటలీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ బల్గరీ దీన్ని రూపొందించింది. 11.6 క్యారట్ల వజ్రాల నెక్లెన్‌ను ప్రియాంక ధరించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీని ఖరీదు 25 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు రూ.204 కోట్లకు పైనే అవుతుంది. మెట్ గాలా పూర్తయిన తర్వాత ఈ నెక్లెస్‌ను వేలం వేయబోతున్నారు. దీనిపై బల్గరీ సంస్థ గానీ, మెట్ గాలా కానీ స్పందించలేదు.

హొయలొలికించిన ప్రియాంక:ఈ సంవత్సరం గాలా వేడుకలో ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌తో కలిసి పాల్గొంది. ప్రముఖ డిజైన్ వాలెంటినో రూపొందించిన థై స్లిట్ గౌన్ ధరించి అందాలు ఆరబోసింది. ప్రియాంకచోప్రా మెట్ గాలాలో పాల్గొనడం ఇది 5వసారి. 2017, 2018, 2019, 2021 సంవత్సరాల్లో ప్రఖ్యాత డిజైనర్ రాల్ఫ్ లారెన్, డయర్ బ్రాండ్ రూపొందించిన దుస్తులు ధరించి పాల్గొంది.
న్యూయార్క్ లో వేడుక:న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుక నిర్వహించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తారలతో పాటు మన దేశ ముద్దుగుమ్మలు కూడా ఎర్రతివాచీపై హొయలొలికించారు. ప్రియాంకతో పాటు బాలీవుడ్ నటి అలియా భట్, ఈశా అంబానీ, నటాషా పూనావాలా సందడి చేశారు. అలియాభట్ పాల్గొనడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications