'నా ఆశీర్వాదంతోనే ప్రియాంక స్టార్‌గా ఎదిగింది'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మంగళవారం సఫాయ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తన ఆశీస్సుల వల్లే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో జరిగిన సఫాయ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ప్రియాంక చోప్రా ఈ ఫెస్టివల్‌కు మూడు సార్లు హాజరైందని చెప్పారు. బరేలీలో ప్రియాంక చోప్రా విద్యార్ధినిగా ఉన్నప్పుడు ప్రియాంక తండ్రి ఆర్మీలో పనిచేసేవారు.

'తాను ఆ సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నాను. అప్పుడు వారు తనను కలిశారని, ఆ సమయంలో పెద్ద హీరోయిన్ కావాలని ప్రియాంకాను నేను ఆశీర్వదించా ను. ఆ ఆశీస్సుల వల్లే ఆమె ఈ రోజు ఇంతపెద్ద స్టార్ అయింది' అని తెలిపారు. మాధురీ దీక్షిత, అమితాబ్ బచ్చన్ వంటి చాలా మంది స్టార్లను తానే సఫాయ్ పెస్టివల్‌కు తీసుకువచ్చానని తనను తాను పొగుడుకున్నారు.
నటించడం ఓ కళ అని, కాబట్టి హీరో, హీరోయిన్లను గౌరవించాలని ములాయం ప్రజలను కోరారు. ములాయం సింగ్ యాదవ్‌కు బాలీవుడ్‌తో చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించే సఫాయ్ ఫెస్టివల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు హాజరవుతూనే ఉంటారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications