డొనాల్డ్ ట్రంప్‌పై ఊగిపోయిన ప్రియాంక చోప్రా
ముంబై: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత, ఇటీవల భారతీయుల భాషపై అనుచితంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. ముస్లీంలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధం విధించాలన్న ఆయన వ్యాఖ్యలను కూడా తప్పు పట్టింది.
ఇటువంటి చర్య ఆదిమ సంస్కృతి అని ధ్వజమెత్తింది. క్లిష్టమైన ఉగ్రవాద నిర్మూలనా అంశాన్ని ఓ వర్గానికి ఆపాదిస్తూ వారిపై నిషేధం విధించడం సరైన చర్య కాదని పేర్కొంది. ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించాలనుకోవడం ఆదిమ చర్యగా అభిప్రాయపడింది.
అమెరికాలో ప్రస్తుతం తీవ్రవాదం సమస్య పైనే నడుస్తున్న క్వాంటికో అనే టీవీ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆమె, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తీవ్రవాదం అంశంపై తెరపైకి బాగా వచ్చిందని పేర్కొంది.
'ఎవరిపైనా నిషేధం విధించకూడదని అని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఓ వర్గానికి చెందిన వ్యక్తుల పైనే అలాంటి వ్యాఖ్యలు చేయడ ఆదిమ చర్య. ఉగ్రవాదాన్ని అంతమొందించడం అనేది క్లిష్టమైన సమస్య. దానిని ఏ ఒక్కరికి ఆపాదించడం భావ్యం కాదు' అని ప్రియాంక చోప్రా అన్నది.
-
హార్మూజ్ తెరవండ్రా : ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయిన ట్రంప్ -
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..! -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు..












Click it and Unblock the Notifications