ప్రియాంకా చోప్రా జిందాబాద్: బహిరంగ సభలో కాంగ్రెస్ నేత స్లోగన్లు..వీడియో వైరల్

పార్టీ అధినేతలపై నాయకులపై ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు అభిమానం ఉండటం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో ఆ అభిమానం పీక్స్‌‌కు వెళితే పొరపాట్లు జరగడం కామన్. పాపం ఇక్కడ కూడా ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పొగిడే క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఆ వీడియోను చూసి నవ్వుకోవడమే కాదు.. సరదా కామెంట్లను కూడా పోస్టు చేస్తున్నారు.

ఇక అసలు విషయానికొస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేంద్రకుమార్ ఆదివారం రోజున ఓ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం పట్ల తన అభిమానంను చాటుకోవాలని భావించారు. కానీ పాపం ఈ ప్రక్రియలో పుసుక్కున నోరు జారారు. సభలో ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియాగాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ గాంధీ కుటుంబానికి జేజేలు పలికాడు. ఇంతవరకు బాగానే ఉంది సినిమా.

ఇంత సినిమా చూపించిన ఆయన ప్రియాంకా గాంధీకి జిందాబాద్ చెప్పాలన్న ఉద్దేశంతో గురుడు ట్రాక్ తప్పారు. ప్రియాంకా గాంధీ జిందాబాద్‌కు బదులు ప్రియాంకా చోప్రా జిందాబాద్ అంటూ జేజేలు కొట్టారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. వెంటనే తన తప్పును తెలుసుకున్న మాజీఎమ్మెల్యే సురేంద్ర కుమార్ గొంతు సవరించుకుని ప్రియాంకాగాంధీ జిందాబాద్ అని చెప్పారు.

Priyanka Chopra Zindabad: Congress leaders video goes viral on social media

ఇక వీడియో కాస్త వైరల్ అవడంతో నెటిజెన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. అకాళీదల్ నేత రాజౌరీ గార్డెన్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ట్విటర్‌లో రియాక్ట్ అయ్యారు. "కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంకా చోప్రాకు జేజేలు పలుకుతున్నారు. పార్టీ మొత్తం పప్పు" అని మంజిందర్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రియాంకా చోప్రా పార్టీలో కానీ చేరుతున్నారా అని పక్కనే ఉన్న వ్యక్తి షాక్‌కు గురయ్యాడని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. కొందరు ప్రియాంకా చోప్రా నిక్ జోనాస్‌ల పెళ్లి ఫోటోను పోస్టు చేశారు.

కొందరైతే నిక్ జోనాస్‌కు కూడా జిందాబాద్ చెప్పలేకపోయారా అంటూ ట్వీట్ చేశారు. నిక్ జోనాస్‌కు కూడా జిందాబాద్ చెప్పండి లేదంటే రాబర్ట్ వాద్రాకు కోపం వస్తుందంటూ మరొకరు ట్వీట్ చేశారు.కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబానికి భజన చేయడం మానుకోవాలని అతిగా భజన చేస్తే ఇదిగో ఇలానే ఉంటుందని మరొకరు ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+