త్రాచు పాములను పట్టుకున్న ప్రియాంక గాంధీ..! ఇందిర మనమరాలికి ఎంతధైర్యమో...!!

రాయ్‌బరేలీ/హైదరాబాద్ :ఎన్నికల ప్రచారంలో ఆమె సాహసాలు కూడా చేస్తున్నారు. సాహసాల్లో అలాంటి ఇలాంటివి కూడా కాదు. ఏకంగా విష సర్పాలతో ఆడుకుంటోంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎక్కడ పర్యటిస్తే అక్కడి ప్రజలతో ఇట్టే మమేకం అయిపోతుంటారు. అక్కడి వారు ఏం చేస్తే ఆ పనిలో పాలుపంచుకుంటూ ఉంటారు. తాజాగా పాములు పట్టేవాళ్లతో మాట్లాడుతూ.. తన చేతుల్తో పాములు పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

లోక్‌సభ ఎన్నికల పర్యటనలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్నికల పర్యటనలో ఉండగా పాములు పట్టేవాళ్లు ప్రియాంక కంట పడ్డారు. ఇంకేముంది..వెంటనే అక్కడి వెళ్లి కూర్చొని వాళ్లతో ముచ్చటించారు.

Priyanka Gandhi holding cobra snakes.!courragious Indira grand daughter.!!

బుట్టలో పాములను చూపించాల్సిందిగా ప్రియాంక గాంధీ వారిని అడిగారు. అవి ప్రమాదకరమైనవి, వద్దని చుట్టు పక్కల చేరిన జనం వారించారు. అయితే ఏం జరగదు..అంతా బాగానే ఉంటుంది అంటూ వారికి సమాధానమిచ్చారు. పాములను చేత్తో పట్టుకుని పరిశీలిస్తూ అక్కడున్న ప్రజల గురించి ఆరా తీశారు.

ఇంకా వారి వద్ద ఎలాంటి రకమైన పాములున్నాయో చూపించాలని అడిగారు. చుట్టూ ఉన్న జనాభా భయపడుతున్నప్పటికీ ప్రియాంక మాత్రం ఎలాంటి భయమూ లేకుండా వాటితో ఆడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కొందరయితే ప్రియాంకకు ధైర్యమెక్కువే అంటూ ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+