గడ్కరీ వంటకానికి ప్రియాంక ఫిదా: రాజకీయాల్లో అరుదైన దృశ్యం!
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన భేటీ రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కేరళలోని రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో అటు సీరియస్ చర్చలు, ఇటు సరదా సంభాషణలు, ఓ ప్రత్యేక వంటకం హైలైట్‌గా నిలిచాయి. వయనాడ్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రియాంకా గాంధీ తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ నితిన్ గడ్కరీని కలిసి కేరళ మీదుగా వెళ్లే 6 ప్రధాన రహదారి ప్రాజెక్టుల గురించి చర్చించారు.
'భాయ్-బెహన్' సరదా సంభాషణ
ఈ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రియాంకా గాంధీ కంటే ముందే ఆమె సోదరుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం రాయ్‌బరేలీకి సంబంధించిన రోడ్డు పనుల గురించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. దీనిని గుర్తు చేస్తూ గడ్కరీ.. "మీ సోదరుడి పనులు చేశాను, ఇప్పుడు మీ పనులు చేయకపోతే.. అన్నయ్య పనులు చేశారు కానీ నావి చేయలేదని మీరు ఫిర్యాదు చేస్తారు కదా!" అని చమత్కరించారు. ఈ మాటలకు ప్రియాంకా గాంధీతో పాటు అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

యూట్యూబ్ వంటకంతో గడ్కరీ ఆతిథ్యం
రాజకీయ చర్చల మధ్యే గడ్కరీ తన అతిథులకు ప్రత్యేక రుచులను రుచి చూపించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నితిన్ గడ్కరీ స్వయంగా ఓ బియ్యం వంటకాన్ని తయారు చేశారు. ఈ రోజు తనను కలవడానికి వచ్చిన ఎంపీలందరికీ ఆయన ఈ వంటకాన్ని వడ్డించారు. ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా కూడా ఆ వంటకాన్ని రుచి చూస్తూ మంత్రితో సంభాషించారు.
VIDEO | Congress MP Priyanka Gandhi Vadra (@priyankagandhi) met Union Minister Nitin Gadkari (@nitin_gadkari) in Parliament Complex earlier today.
— Press Trust of India (@PTI_News) December 18, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/4DOHwWY3EI
కేరళ ప్రాజెక్టులపై చర్చ
ప్రియాంక కోరిన 6 ప్రాజెక్టులలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వాటిని కేంద్రం నేరుగా చేపట్టలేదని గడ్కరీ వివరించారు. అయితే మిగిలిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. ప్రస్తుతం కేరళలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కింద ఉన్న ప్రాజెక్టులను, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే స్వయంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications