యోగిని పొగిడిన ప్రియాంక గాంధీ .. ఎందుకో తెలుసా..?

లక్నో : రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలే .. పొగడ్తలు, కొనియాడటం అంటూ ఉండదు. ఇక ప్రధాన పార్టీల్లో మాత్రం కలలో కూడా అభినందనలు ఉండవు. కానీ కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క ప్రియాంక గాంధీ .. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించారు. విపక్ష బీజేపీ నేత, యూపీ సీఎం యోగిని ప్రియాంక పొగడటం సర్వత్రా చర్చానీయాంశమైంది.

 priyanka gandhi praise yogi adityanadh

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించారు. ప్రియాంక పర్యటన సందర్భంగా ఆమెకు పూర్తి భద్రత కల్పించారు. దీనిపై ప్రియాంక సంతృప్తి వ్యక్తం చేశారు. తన భద్రతపై యోగి సర్కార్ చూపిన శ్రద్దను సామాజిక మాధ్యమం వేదికగా అభినందించారు. అయితే తనకు కల్పించే భద్రత వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని యూపీ సీఎం యోగిని కోరారు.

రాయ్ బరేలిలో సోనియా విజయం సాధించిన ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కూడా హాజరయ్యారు. అమేథిలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ కూడా పర్యటించారు. తమ కంచుకోటపై సోనియా, రాహుల్, ప్రియాంక ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకు భద్రతపై యోగి కేర్ తీసుకున్నారు. దీనిపై ఆమె థాంక్స్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+