రాహుల్ దత్తత ఇష్యూ: స్పందించిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తన కుమారుడుని దత్తతు తీసుకుంటున్నారన్న వార్తలపై ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలను ప్రచురించిన మీడియా సంస్దలకు ఆమె లీగల్ నోటీసులను జారీ చేశారు.
తన కుమారుడిని రాహుల్ గాంధీ దత్తతు తీసుకోవడం లేదంటూ వార్తలను ప్రచురించిన మీడియా సంస్దలకు రిజాయిండర్లను పంపించారు. "కల్పిత వాస్తవాలతో ప్రచురితమైన మీ వార్తలు నా కుటుంబ ప్రతిష్ఠతో పాటు, నా మాతృత్వం, వ్యక్తిత్వంపై నిందలేసే విధంగా ఉన్నాయి. కేవలం అవాస్తవాలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించనున్న మీ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను" అంటూ ప్రియాంకా గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముద్దుల కూతురైన ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాను 1997లో వివాహాం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రైహాన్, మిరియా. ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోని రాహుల్ గాంధీ, తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడిని దత్తతు తీసుకుంటున్నారని మంగళవారం కొన్ని వార్తాపత్రికలు వార్తలను ప్రచురించాయి.
అంతేకాకుండా తన కుమారుడు రైహాన్‌కు గాంధీ పేరును తగిలించి కుటుంబ వారసత్వాన్ని అందించడంతో పాటు రాజకీయంగా లభ్ది పొందేందుకు రాహుల్ గాంధీ చూస్తున్నాడంటూ వార్తలు వెల్లడించాయి. ఈ వార్తా కథనాలపై రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు.












Click it and Unblock the Notifications