ఎంపీగా తొలిసారి పార్లమెంటులోకి ప్రియాంక గాంధీ: ముహూర్తం ఖరారు

వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 4 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ఆమె సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక.. ఈ భారీ విజయాన్ని అందుకోవడం విశేషం.

కాగా, గురువారం (నవంబర్ 28)నాడు ప్రియాంక వాద్రా పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఆమెతోపాటు ఎంపీలు
వసంతరావు కూడా ఎంపీగా ప్రమాణం చేస్తారు. తొలిసారి ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక గాంధీ మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టనుండటం గమనార్హం.

Priyanka Gandhi Vadra to take oath as Member of Parliament on Nov 28

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి భారీ విజయం సాధించారు. అయితే, రాహుల్ రాయల్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా కొనసాగాలనుకున్నారు. ఈ క్రమంలో వయనాడ్ ఎంపీ స్థానానికిఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

ఈ నేపథ్యంలో వయనాడ్ ఉపఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ.. ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. గట్టిపోటీనిస్తుందనుకున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడోస్థానంలో నిలిచారు. కాగా, ప్రియాంక గాంధీ ఇంతకుముందు వరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరపున ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేసే చేశారు.

కాగా, నవంబర్ 23న ప్రియాంక వాయనాడ్‌లో గెలిచిన తర్వాత ఓటర్లు తమకు మద్దతు ఇచ్చినందుకు తన అభినందనలను తెలియజేశారు. వారి నమ్మకానికి తాను ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్లమెంట్‌లో తమకు సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహిస్తానని హామీ ఇచ్చానని ప్రియాంకపేర్కొన్నారు. 'మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో మునిగిపోయాను" అని ప్రియాంక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వయనాడ్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+