చంపేస్తామన్నారు: రాహుల్, ప్రియాంకలపై ఆప్ అభ్యర్థి
అమేథి: ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ అభ్యర్థి కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీ వాద్రాల సన్నిహితుడు ఒకరు తనను చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని కుమార్ విశ్వాస్ చెప్పారు. ఈ మేరకు వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
అంతేగాక అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వ్యక్తి ప్రియాంక గాంధీ కారు వెంట పరుగెడుతూ.. కుమార్ విశ్వాస్‌ను షూట్ చేస్తానని అంటున్నాడు. ఇందుకు ప్రతిగా స్పందించిన ప్రియాంక గాంధీ, ఈ విధంగా మాట్లాడ కూడదని వారించారు. చర్చించేందుకు ఓసారి తన గెస్ట్ హౌజ్‍కి రావాలని చెప్పారు.

ఇది ఇలా ఉండగా కుమార్ విశ్వాస్ ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ప్రియాంక గాంధీ అన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన గెస్ట్ హౌజ్‌కి వస్తే చర్చించుకోవచ్చని చెప్పారు. రాహుల్ గాంధీ తరపున ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథి లోకసభ నియోజక వర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్ నామినేషన్ వేశారు. కవిగా సుపరిచితుడైన కుమార్ విశ్వాస్ ప్రస్తుతం ఓట్ల వేటలో పడ్డారు. తమ పార్టీకి మద్దతుగా నిలవాలని నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా రాహుల్ గాంధీకి ప్రధాన ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ ఉన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications