మోడీ సవాల్‌ను స్వీకరించిన తార ప్రియాంక చోప్రా
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ సవాల్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు.
మోడీ 9 మందిని ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రధాని విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇదా చాల మంచి ఆలోచన అని ఆమె అననారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించాలని ఆమె తన అభిమానులను కోరారు. మరోవైపు, అమీర్ ఖాన్ ఓ అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
-
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం











Click it and Unblock the Notifications