ప్రియాంక చోప్రా క్లీవేజ్ షోపై వివాదం: అసెంబ్లీలో దుమారం
Recommended Video

గౌహతి: బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా హాట్ ఫోటోలు అస్సాం అసెంబ్లీలో దుమారం రేపుతున్నాయి. ఆమె రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దాంతో రాష్ట్ర పర్యాటక శాఖ క్యాలెండర్ కోసం ఆమె హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చారు.
క్లీవేజ్ షోతో ఉన్న ఆమె ఫొటోలు రాష్ట్రంలో దర్శనమిస్తన్నాయి. దానిపై కాంగ్రెసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమె ధరించిన దుస్తులపై విమర్శలు చేస్తోంది. అస్సామీ సంప్రదాయానికి భిన్నంగా ఉన్నాయని అంటోంది.

ప్రియాంక చోప్రా గౌనుపై....
ప్రియాంక చోప్రా ధరించిన గౌను అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకమని అంటూ ఆదాయం కోసం ప్రభుత్వం ఇంతగా దిగజారాలా కాంగ్రెసు సభ్యులు విరుచుకుపడుతున్నారు. తారలు సంప్రదాయమైన పద్ధతిలో కనిపించాలి తప్ప అర్ధనగ్నంగా ప్రదర్శనలకు దిగడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆ విషయంపై చర్చను లేవదీసి...
ఆ విషయంపై శాసనసభ్యలు నందితా దాస్, రుప్‌జ్యోతి కుర్మిలు శాసనసభలో ఇటీవల చర్చను లేవదీశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రాను తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. అయితే, పర్యాటక శాఖ మంత్రి హిమంత బిస్వా దానిపై వివరణ ఇస్తూ ప్రియాంక చోప్రాకు మద్దతు పలికారు.

అసభ్యత ఎక్కడుంది...
ప్రియాంక చోప్రా ఫొటోల్లో అసభ్యత ఎక్కడుందో తెలియడం లేదని మంత్రి హిమంత బిస్వా అన్నారు. సంప్రదాయ వేడుకల్లో ధోవతి, చీరలు ధరించి అదే రీతిలో కనిపించాలని, ఇది పర్యాటక శాఖకు సంబంధించిన విషయమని, విదేశీయులు కూడా వస్తుంటారని, వారికి పలికే ఆహ్వానం ఆకర్షణియంగా ఉండాలని అన్నారు.

చీరల్లో పిలిస్తే ఎవరూ రారు
చీరల్లో పిలిస్తే ఎవరూ రారని హిమంత బిస్వా అన్నారు. అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారనే విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెసు సభ్యులు తీవ్రమైన అభ్యంతరం చెప్పారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications