సీఎం పళని, పన్నీర్ పక్కా ప్లాన్: దినకరన్ క్యాంప్ ఎమ్మెల్యేలు జంప్, బెంగళూరు రిసార్ట్ కు !

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి 23 మంది ఎమ్మెల్యేలను తన గ్రూప్ లో చేర్చుకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పె

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురై తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి 23 మంది ఎమ్మెల్యేలను తన గ్రూప్ లో చేర్చుకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న టీటీవీ దినకరన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న దినకరన్ గ్రూప్ లోని సౌందర్ రాజ్ తో సహ ఐదు మంది ఎమ్మెల్యే చిన్నగా అక్కడ నుంచి జారుకున్నారని వెలుగుచూసింది. ఐదు మంది ఎమ్మెల్యేలు జారిపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు జంప్ కాకుండా టీటీవీ దినకరన్ జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.

Pro TTV Dinakaran five MLAs escaped from Pudhucherry resort

పుదుచ్చేరి నుంచి ఎమ్మెల్యేలను బెంగళూరుకు మార్చాలని టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అన్నాడీఎంకే (శశికళ వర్గం) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేందితో దినకరన్ చర్చలు జరిపి బెంగళూరు శివార్లలోని రిసార్ట్ లో ఎమ్మెల్యేలు ఉండటానికి ఏర్పాట్లు చెయ్యాలని సూచించారని తెలిసింది.

పుదుచ్చేరి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు పారిపోలేదని, వారి సొంత నియోజక వర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు, కుటుంబ శుభకార్యాలకు హాజరుకావడానికి టీటీవీ దినకరన్ అనుమతి తీసుకుని వెళ్లారని శశికళ వర్గంలోని నాయకులు అంటున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలో మళ్లీ మాక్యాంప్ కు వస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ దినకరన్ క్యాంపకు వెళ్లకుండా చూడటానికి సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను వీలైనంత త్వరగా మళ్లీ తన గ్రూపులోకి వచ్చే విధంగా టీటీవీ దినకరన్ తో పాటు మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+