వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్ధులకు సెక్స్ పాఠాలు: ప్రోఫెసర్ మురుగన్ అరెస్ట్, నిర్మలకు భర్త విడాకుల నోటీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:విద్యార్ధినులకు పడువు వృత్తిలోకి దింపుతోందనే ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్న ప్రోఫెసర్‌ మురుగన్‌ను సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు నిర్మలాదేవికి ఆమె భర్త విడాకుల నోటీసును పంపారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

విద్యార్ధినిలకు సెక్స్ పాఠాలు: నిర్మలాదేవి డైరీ సీజ్, షాకింగ్ విషయాలు విద్యార్ధినిలకు సెక్స్ పాఠాలు: నిర్మలాదేవి డైరీ సీజ్, షాకింగ్ విషయాలు

విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలలో అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు గవర్నర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సంతానం నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేశారు. మరో వైపు సిబిసిఐడి పోలీసులు ఈ కేసులో నిర్మలాదేవిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ కేసులో కీలకమైన ఆధారాలను సిబిసిఐడి అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే నిర్మలాదేవి డైరీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిర్మలాదేవి ఇంటి నుండి కీలకమైన పత్రాలను కూడ ఈ సోదాల్లో సీజ్ చేశారు సిబిసిఐడి అధికారులు.

ప్రోఫెసర్ మురుగన్ అరెస్ట్

ప్రోఫెసర్ మురుగన్ అరెస్ట్

విద్యార్ధినులను పడువు వృత్తిలోకి దింపుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి కేసులో కీలకంగా మారిన ప్రోఫెసర్ మురుగన్‌ను సిబిసిఐడి పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. నిర్మలాదేవిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రోఫెసర్ మురుగన్‌తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. అయితే మురుగన్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు నిర్మలాదేవి వద్ద జరిపిన విచారణలో పలువురు వీవీఐపీలు, వీఐపీలు పాత్ర ఉన్నట్లు సమాచారం. నాలుగురోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మురుగన్‌ యూనివర్సిటీలోని అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకం చేసేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు రావడంతో పోలీసు అధికారులు చుట్టుముట్టి అరెస్ట్‌ చేశారు.

మధురై యూనివర్శిటీ అధికారుల విచారణ

మధురై యూనివర్శిటీ అధికారుల విచారణ

మదురై యూనివర్సిటీ మానవవనరుల శాఖ సంచాలకులు కలైసెల్వన్, సహాయక ప్రొఫెసర్లు మురుగన్, కరుప్పుస్వామిలను విచారించాలని నిర్ణయించారు.కలైసెల్వన్‌ ఆదివారం విచారణకు హాజరుకాగా తమ కస్టడీలోనే ఉంచుకుని విచారిస్తున్నారు. మిగిలిన ఇద్దరూ గత నాలుగురోజుల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లడంతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు తీవ్రతరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.

విడాకుల కోసం భర్త పిటిషన్

విడాకుల కోసం భర్త పిటిషన్

అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి భర్త శరవణపాండియన్‌ ఆమె నుండి విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారు.ఈ మేరకు విడాకుల నోటీసును కూడ పంపారు. గతంలోనే విడాకులు తీసుకోవాలని ఆయన భావించారు. అయితే ఈ దంపతులకు పుట్టిన పిల్లల భవిష్యత్ దృష్ట్యా విడాకుల నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకొన్నారని సమాచారం. అయితే నిర్మలాదేవి వ్యవహారం బయటకు రావడంతో తాజాగా ఆయన విడాకుల నోటీసును పంపించారని తెలుస్తోంది.

కాంట్రాక్టుల్లో అక్రమాలు

కాంట్రాక్టుల్లో అక్రమాలు

అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలాదేవి తన భర్త నిర్వహించే కాంట్రాక్టులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడ వచ్చాయి. ఈ విషయమై సిబిసిఐడి అధికారులు కాంట్రాక్టర్లను పిలిచి విచారణ చేస్తున్నారు. నిర్మలాదేవి భర్త శరవణపాండియన్‌ ప్రభుత్వ కాంట్రాక్టరు కావడంతో కాంట్రాక్టులను పొందేందుకు వీరి సిఫార్సులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా సదరు ప్రభుత్వ అధికారులను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

English summary
On the fourth day of investigation, the state CB-CID made some progress and arrested a professor Murugan who was in constant touch with tainted professor Nirmala Devi booked by the police for her attempt to lure students in to a sex scandal promising marks and money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X