Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని

తల్లిదండ్రుల తర్వాత గురువును అధికంగా అభిమానిస్తుంటారు విద్యార్థులు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. అందరిముందూ సిగ్గు లేకుండా ఓ విద్యార్థినికి I LOVE U చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

కర్ణాటకలోని తుమకూర్ లో ఉన్న శ్రీ సిద్ధార్థ్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినికి క్లాస్ రూమ్ ముందే I LOVE U చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆ ప్రొఫెసర్ ను చితకబాదారు. ఈ కాలేజీకి హెడ్ అయిన కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర.. ఆ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు.

Professor Proposes to Student at Sri Siddhartha Medical College Viral Video Sparks Debate Karnataka

అబ్దుల్ అనే ప్రొఫెసర్ ఓ కాలేజీ ఈవెంట్ లో మాట్లాడుతూ.. " ఈ బ్యాచ్ నాకు ఇచ్చిన ప్రేమను మరువలేను. అలాగే ఈ బ్యాచ్ లోని ఓ ముఖ్యమైన విద్యార్థినికి నేను ప్రొపోజ్ చేయాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను బ్యాచ్ మొత్తానికి చాక్లేట్స్ పంచిపెడతాను. I LOVE U.." అని అందరిముందు ఆ విద్యార్థినికి చెప్పాడు అబ్దుల్. దాంతో ఆగ్రహించిన విద్యార్థులు అతడ్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రొఫెసర్ అబ్దుల్ అందరి ముందూ I LOVE U చెప్పి పోడియం కిందకు దిగుతుండగా.. విద్యార్థులు అతడికి అడ్డుపడి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చేసుకున్నాక అక్కడే సదరు విద్యార్థిని.. ప్రొఫెసర్ ను చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+