వేటగాళ్ల తూటాలకు బలైన అరుదైన చిరుత! ప్రాజెక్ట్ చీతాకు కోలుకోలేని దెబ్బ..

మధ్యప్రదేశ్ అడవుల్లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ప్రాజెక్ట్ చీతా'కు మరో తీవ్ర విఘాతం కలిగింది. వేటగాళ్ల దురాలగతానికి ఒక 19 నెలల అరుదైన మగ చిరుత (KNG22) బలైపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఈ మూగజీవి, చికిత్స పొందుతూ కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

మూడు రోజుల క్రితం షియోపూర్ ప్రాంతీయ అటవీ విభాగంలో ఓ మగ చిరుత తీవ్రగాయాలతో పడి ఉండటాన్ని పెట్రోలింగ్ బృందం గుర్తించింది. వెంటనే స్పందించిన అధికారులు దాన్ని సురక్షితంగా రక్షించి వైద్య చికిత్స కోసం కేంద్రానికి తరలించారు. చిరుత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఎక్స్ రే, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా అసలు నిజం బయటపడింది. ఆ మూగజీవి శరీరంలోకి ఏకంగా ఐదు బులెట్లు దూసుకెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. లోపలి అవయవాలు, నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో అత్యవసర శస్త్రచికిత్స జరిపి ఆ గుళ్లను వెలికితీసినప్పటికీ, ప్రాణాలు కాపాడలేకపోయారు.

Project Cheetah Setback 19 Month Old Cheetah KNG22 Dies After Surgery Recovers Five Gunfire Pellets
Cheetah: కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి..
Cheetah: కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి..

రంగంలోకి స్పెషల్ టాస్క్ ఫోర్స్.. ఉన్నత స్థాయి విచారణ!

అభయారణ్యంలోకి చొరబడి చిరుతపై కాల్పులు జరిపిన ఘటనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. వేటగాళ్ల కుట్ర లేదా ఆకతాయిల చర్య అయి ఉండవచ్చనే అనుమానంతో సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ ఘటన వెనుకున్న అసలు దోషులను పట్టుకోవడానికి అటవీ శాఖ, పోలీసు అధికారులతో కూడిన 'స్పెషల్ టాస్క్ ఫోర్స్' (STF)ను ఏర్పాటు చేసింది. వేటగాళ్ల కదలికలపై నిఘా పెంచి, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీనియర్ అటవీ అధికారులు స్పష్టం చేశారు.

Mukhi: మన దేశంలోనే పుట్టి.. ఇప్పుడు అడవినే ఏలుతున్న ముఖి!
Mukhi: మన దేశంలోనే పుట్టి.. ఇప్పుడు అడవినే ఏలుతున్న ముఖి!

పర్యవేక్షణ బృందాలు అలర్ట్.. మరోవైపు గాయపడిన మరో పిల్ల చిరుత!

కూనో జాతీయ ఉద్యానవనానికి చెందిన 'నిర్వ' అనే ఆడ చిరుతకు జన్మించిన 19 నెలల మగ పిల్ల చిరుత కూడా గాయపడిన స్థితిలో దొరకడం కలకలం రేపింది. అక్టోబర్ 25 సాయంత్రం మోరేనా అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న స్థితిలో ఉన్న ఈ చిన్న చిరుతను పర్యవేక్షణ బృందం గుర్తించి వెంటనే రక్షించింది. ప్రస్తుతం కూనో నేషనల్ పార్క్‌లో వైద్యుల సమక్షంలో దానికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వరుసగా అరుదైన చిరుతలు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం వెనుక అటవీ ప్రాంతంలో భద్రతా లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+