వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో రాళ్లదాడి... పోలీసుల లాఠీచార్జ్... పౌరసత్వంపై నిరసనలు కంటిన్యూ...

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.... ఓవైపు జమియా మిలియా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన బాటపడుతుండగా యూనివర్శిటి బయట ప్రాంతాల్లో కూడ పౌరసత్వ ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అందోళన కారులపై పోలీసులు బాష్పవాయు గోళాలు పేల్చుతుండగా... పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ నిరసనలు తీవ్రమవుతున్నాయి. గత నాలుగు రోజులుగా జామియా మిలియా యూనివర్శీటిల్లో తీవ్ర నిరసనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఇతర ప్రాంతాల్లో కూడ నిరసనలు కొనసాగుగున్నాయి. దీంతో ఢిల్లీలోని జఫ్రాబాద్, సీలంపూర్ ప్రాంతాల్లో అందోళనకారులకు మరియు పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. నిరసన కారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

protest against the Citizenship Act continuing at Delhi

దీంతో పోలీసులు సైతం ఫైరింగ్ ఓపెన్ చేశారు. బాష్పవాయు గోళాలతో నిరసన కారులను చెదరగొట్టె ప్రయత్నం చేశారు. మరోవైపు ఆందోళనలు తీవ్రం కావడంతో ఆయా ప్రాంతాల్లో లాఠీ చార్జీ కూడ చేశారు. నిరసన ప్రదర్శన నేపథ్యంలో సీలంపూర్‌ నుంచి జఫ్రాబాద్‌ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు వెల్‌కం, జఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌-బబర్పూర్‌ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు.

English summary
Clashes broke out today during a protest against the Citizenship Act at Delhi's Seelampur area, where protesters threw stones at policemen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X