రాత్రి వేళ ముఖ్యమంత్రి నివాసం ముట్టడి- తీవ్ర ఉద్రిక్తత: గాల్లోకి కాల్పులు

ఇంఫాల్: కొన్ని నెలలుగా హింసాత్మక పరిస్థితులతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తలెత్తాయి. అక్కడ నెలకొన్న హింసాత్మక పరిస్థితులను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ కొలిక్కి రావట్లేదు. మణిపూర్ పరిస్థితులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించట్లేదు.

ఈ పరిస్థితుల మధ్య కొద్దిసేపటి కిందట పలువురు ఆందోళనకారులు ఈస్ట్ ఇంఫాల్‌ జిల్లాలోని హెయిన్‌గాంగ్‌లో గల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రైవేట్ ఇంటిని ముట్టడించారు. ఇటీవలే ఇద్దరు మేటీ తెగకు చెందిన ఫిజం హేమన్‌జిత్, లువాంగ్థాయ్ హిజం దారుణ హత్యకు గురి కావడాన్ని నిరసిస్తూ సుమారు 500 మందికి పైగా ఆందోళనకారులు సీఎం ఇంటిని చుట్టుముట్టారు.

Manipur

ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు చేరుకోవడం, నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు, భద్రత బలగాలు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ వారు అక్కడి నుంచి కదల్లేదు. రోడ్డుపైనే బైఠాయించడం మొదలుపెట్టారు. దీనితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Manipur

వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సుమారు 40 నిమిషాలు పలు రౌండ్ల మేర టియర్ గ్యాస్‌ను సంధించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులతో జరిగిన ఘర్షణలో కొంతమంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు.

గాలిలో కాల్పులు జరిపిన తరువాత ఆందోళనకారులు చెదిరిపోయారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఇంఫాల్ పోలీస్ కమిషనర్ వివరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+