రిజర్వేషన్ ఫైట్: హింసాత్మకంగా మారిన మరాఠాల ఆందోళనలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తహసీల్దార్ పరిధిలో మరాఠా సామాజిక వర్గంవారు తమ నిరసనను తెలిపారు. ఔరంగాబాద్ పూణే హైవేపై నిన్నటినుంచి బైటాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కాకాసాహెబ్ షిండే అనే వ్యక్తి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పక్కనే ఉన్న గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నిరసనకారులు తీవ్ర ఆందోళనకు దిగారు.

వ్యక్తి మృతి చెందడంతో మరాఠా క్రాంతి మోర్చా సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఔరంగాబాద్ పూణే హైవేపై వస్తున్న బస్సును అడ్డగించి నిప్పుపెట్టారు. ముంబై పూణే హైవేపై కూడా నిరసనకారులు బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న తమను పోలీసులు రెచ్చగొట్టారని నిరసనకారులు చెబుతున్నారు. నిజంగా మరాఠా రక్తం తమ నరాల్లో ప్రవహిస్తున్నట్లయితే నీటిలో సమాధి అవ్వండటూ పోలీసులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిరసనకారులు చెప్పారు.

మరోవైపు నిన్న ఆత్మహత్య చేసుకున్న యువకుడి అంత్యక్రియలు హాజరయ్యేందుకు వెళ్లిన శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైర్ పై స్థానికులు దాడి చేశారు. అతని కాన్వాయ్‌ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.ప్రభుత్వం ముందు తాము 30 డిమాండ్లు ఉంచామని... అందులో ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని నిరసనకారులు చెప్పారు. మరాఠా ప్రజల నిరసనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంలేదని త్వరలో ఫడ్నవీస్ సర్కార్‌కు బుద్ధి వచ్చేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications