పెళ్లి చేసుకొని మగతనం నిరూపించుకో: ఆదిత్యనాథ్‌పై అజంఖాన్
లక్నో: సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్ బిజెపి పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సవాల్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఆదిత్యనాథ్ పైన అజమ్ ఖాన్ నోరు పారేసుకున్నాడు. నీవు పెళ్లి చేసుకొని మగతనం నిరూపించుకోవాలన్నాడు.
ఆదిత్యనాథ్ పలు అంశాల పైన ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తుంటారు. ఈ సందర్భంగా అజమ్ ఖాన్ మాట్లాడుతూ... ఆదిత్యనాథ్ ఇతరుల పైన విమర్శలు మానివేసి ముందుగా పెళ్లి చేసుకోవాలని, తాను ఏమిటో నిరూపించుకోవాలని, తండ్రిగా మారాలని అన్నారు.

అలా చేయడం వల్ల అతడి తరం పెరుగుతుందన్నారు. ఆదిత్యనాథ్ తప్పకుండా ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోవాలని, అది అతడి తరాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అజమ్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
తలాక్ వ్యవస్థ పైన బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యల పైన కూడా అజమ్ ఖాన్ స్పందించాడు. ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తా ఇలాంటి విషయాల గురించి మాట్లాడేది అన్నాడు. రేపిస్ట్ ఆరోపణలు ఎదు%E












Click it and Unblock the Notifications