పీఎస్ఎల్వీసీ-56 ప్రయోగం విజయవంతం - ఇస్రో మరో అరుదైన ఘనత..!!
ఇస్రో మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన వాణిజ్య ప్రయోగం విజయవంతం అయింది. సింగపూర్‌కు చెందిన 360 కిలోల బరువు గల డీఎఎస్ఆర్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి.ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్య ప్రయోగం. రాకెట్ నింగిలోకి ఎగిరిన తరువాత 535 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో ఉపగ్రహాలను విడిచిపెట్టింది. నాలుగు దశల్లో సాగిన ఈ ప్రయోగం విజయవంతం అయింది.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota.
— ANI (@ANI) July 30, 2023
(Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH
శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి డీఎస్‌ఎల్‌వీ-ఎస్ ఏఆర్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ56 విజయంతంగా ప్రయోగించింది.. డీఎస్-ఎస్‌ఏఆర్ ఉపగ్రహం బరువు 360 కిలోలు. సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డీఎస్టీఏ), ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఈ ఉపగ్రహం పగలు-రాత్రి కవరేజీని అందివ్వనుంది. ఇది పూర్తి పోలారిమెట్రీ వద్ద 1 మీ-రిజల్యూషన్ వద్ద ఇమేజింగ్ చేయగలదు. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు సేవలందించనుంది. చంద్రయాన్ .3 రాకెట్ ప్రయోగం విజయవంతం తర్వాత పదిహేను రోజులకే ఇస్రో శాస్త్రవేత్తలు సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.

పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇటీవల ఇస్రో వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఓఆర్బీ-12 స్ప్రైడర్ శాటిలైట్లను కూడా నింగిలోకి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కమర్షియల్ పీఎస్‌ఎల్వీ మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తరఫున ఈ ఏడు ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఇస్రో వెల్లడించింది.
శనివారం ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ షార్‌కు శుక్రవారం రాత్రే చేరుకొని కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన తరువాత 535 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో ఉపగ్రహాలను విడిచిపెట్టనుంది. పీఎస్ఎల్వీ-సీ56 రాకెట్ నమూనాకు శనివారం తిరుమల శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది ఇస్రోకు ఇది మూడో వాణిజ్య ప్రయోగం. ప్రయోగం విజయంతం కావటంపై శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ అభినందించారు.












Click it and Unblock the Notifications