girls: అమ్మాయిల జీవితంతో ఫుడ్ బాల్ ఆడుకున్నాడు, కన్న తల్లిని కూడా వదల్లేదు !
చెన్నై/నీలగిరి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం కాపురం చేశాడు. రానురాను భర్త తీరుతో అతని భార్య విసిగిపోయింది. భర్తకు ఎంత చెప్పినా అతను మాట వినకపోవడంతో భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది, భార్యకు విడాకులు ఇచ్చిన భర్త అతని అసలు స్వరూపం ఇతరుల మీద చూపించడం మొదలుపెట్టాడు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ధర్మగిరికి చెందిన జెస్సీలి (34) అనే వ్యక్తి కేరళలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. సెలవుపై సొంత ఊరికి వచ్చి వెలుతున్న జెస్సిలి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలతో స్నేహంగా ఉండే జెస్సీలి వారి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి మెసెంజర్‌లో తన స్నేహితులకు పంపడం అలవాటు చేసుకుకున్నాడు.

ఆ ప్రాంతానికి చెందిన కొందరు మహిళల ఫొటోలను కూడా అసభ్యకరంగా చిత్రీకరించిన జెస్సీలి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ చిత్రాలను జెస్సీలి అతని సెల్‌ఫోన్‌లో భద్రపరిచాడు. జెస్సీలి చాలా మంది ఫోటోలు ఇలాగే మార్ఫింగ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇదే విషయంలో ఓ లేడీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని జెస్సీలి అడిగారు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తోపులాటగా మారింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని జెస్సీలి అతని స్నేహితురాలిని బెదిరించాడు.
దీంతో షాక్‌కు గురైన వ్యక్తి ఘటనపై ఊటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు జెస్సీలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జెస్సీలి అతని సెల్‌ఫోన్‌లో అనేక మంది యువతుల అసభ్యకరమైన ఫోటోలతోప పాటు అతనికి జన్మనిచ్చిన తల్లి చిత్రాన్ని అసభ్యకరంగా తన స్నేహితులకు పంపించడంపై పోలీసులు విస్తుపోయారు.
జెస్సీలికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. అతడి చర్యల వల్లే కొన్నాళ్ల క్రితం భార్య విడాకులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద నిందితుడు జెస్సీలి మీద కేసులు నమోదె చేశామని ఊటీ సైబర్ క్రైమ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications