బెంగళూరులో మహిళలకు సైకో చిత్రహింసలు, ప్యాంట్ విప్పేసి అసభ్యంగా, చివరికి !
బెంగళూరు: ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరులో సైకోలు ఎక్కువ అవుతున్నారు. నడి రోడ్డులో ప్యాంట్ విప్పేసి నగ్నంగా తయారై మహిళల ముందు అసభ్యంగా ప్రవర్థిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సైకోను బెంగళూరులోని ఆర్ టీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.
మహమ్మద్ సిద్దిఖి అనే వ్యక్తిని విచారణ చేస్తున్నామని శనివారం పోలీసులు చెప్పారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్ టీ నగర్ పరిసర ప్రాంతాల్లో మహమ్మద్ సిద్దిఖి సాయంత్రం సంచరిస్తున్నాడు.

ప్రతిరోజూ సాయంత్రం అయితే ప్రత్యక్షం అయ్యే మహమ్మద్ సిద్దిఖి తాను ఆయుర్వేదిక్ వైద్యుడు అంటూ స్థానికులను నమ్మిస్తున్నాడు. ఒంటరిగా ఎవరైన మహిళలు వస్తే ప్యాంట్ విప్పేసి అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడు. మహిళలు కేకలు వేస్తే అక్కడి నుంచి పారిపోతున్నారు.
మహమ్మద్ సిద్దిఖి చేష్టలతో స్థానికులు విసిగిపోయారు. ఒంటరిగా వెలుతున్న మహిళ ముందు మహమ్మద్ సిద్దిఖి ప్యాంట్ విప్పి అసభ్యంగా ప్రవర్థిస్తున్న సమయంలో స్థానిక మహిళలు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
మహమ్మద్ సిద్దిఖి అసభ్యంగా ప్రవర్థించిన దృశ్యాలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని, కేసు విచారణలో ఉందని ఆర్ టీ నగర్ పోలీసులు తెలిపారు. ఇటీవల లేడీస్ హాస్టల్ లో అమ్మాయిలు వేసుకునే లోదుస్తులు వేసుకుని వెళ్లి వారిని వేధింపులకు గురి చేసిన సైకో చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు.












Click it and Unblock the Notifications