Girlfriend: ప్రియురాలి హత్య కేసులో ట్విస్ట్, సైకో సీరియల్ కిల్లర్ డెక్ట్సర్ ఎఫెక్ట్, అమెరికా సెంట్, అగరబత్తీలు
న్యూఢిల్లీ: కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడికి పరియచం అయ్యింది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరూ ప్రతిరోజు గంటలు గంటలు గడుపుతున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు మ్యాటర్ తెలిసిపోయింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అమ్మాయికి ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన ప్రియురాలు వేరే సిటీకి వెళ్లిపోయి ప్రియుడితో డేటింగ్ చేస్తోంది. ఇటీవల యువతి మాయం కావడంతో ఆమె తండ్రి పోలీసు కేసు పెట్టాడు. పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చేశాయి. కనపడకుండా పోయిన యువతి శరీరం 35 ముక్కలు అయ్యిందని వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే సైకో సీరియల్ కిల్లర్ డెక్ట్సర్ చూసి తాను అచ్చం సీరియల్ ల్లోలాగే చేశానని ప్రియుడు పోలీసులకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం
ముంబాయిలో ప్రముఖ కార్పోరేట్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్ లో శ్రద్దా (26) అనే యువతి ఉద్యోగంలో చేరింది. ఇదే కంపెనీలో అఫ్తాబ్ పూనవల్లా అలియాస్ అఫ్తాబ్ అనే యువకుడు ఉద్యోగంలో చేరాడు. కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రాద్దా, అఫ్తాబ్ కు పరియచం అయ్యింది. కొంతకాలం తరువాత అఫ్తాబ్, శ్రద్దా ప్రేమించుకున్నారు.

మతం వేరు......ఢిల్లీకి జంప్
శ్రద్దా ఆమె ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఎప్పుడపడితే అప్పుడు ఇంటికి రావడంతో శ్రద్దా గురించి ఆమె తండ్రి ఆరా తీశాడు. అప్పుడు శ్రద్దా కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ విషయం తెలిసింది. శ్రద్దా, అఫ్తాబ్ మతాలు వేరుకావడంతో వారు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని శ్రద్దా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

ఢిల్లీలో సహజీవనం
ప్రియుడు అఫ్తాబ్ పెళ్లి చేసుకోవడానికి వీలులేదని శ్రద్దా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో కొంతకాలం ఆమె ఇంట్లో గొడవలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఢిల్లీకి వెళ్లిపోయి ప్రియుడు అఫ్తాబ్ తో కలసి డేటింగ్ చేస్తోంది. ఢిల్లీలోని మెహ్రోలీ లోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టిన అఫ్తాబ్ శ్రద్దా ఎంజాయ్ చేస్తున్నారు. ఢిల్లీలోని స్టార్ హోటల్ లో అఫ్తాబ్ చెఫ్ గా ఉద్యోగంలో చేరాడు.

పెళ్లి చేసుకోవాలని గర్ల్ ఫ్రెండ్ ఒత్తిడి
ప్రియుడితో శ్రద్దా వెళ్లిపోవడంతో చాలాకాలం పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ కూడా చెయ్యకుండా కోపంతో ఉండిపోయారు. పెళ్లికాకుండా ఎంతకాలం మనం సహజీనం చేద్దాం, మనం పెళ్లి చేసుకుందామని శ్రద్దా ఆమె ప్రియుడు అఫ్తాబ్ మీద ఒత్తిడి చేసింది. అియతే శ్రద్దాను పెళ్లి చేసుకోవడం హఫ్తాబ్ కు ఏమాత్రం ఇష్టం లేదు.

ప్రియురాలిని చంపేయాలని డిసైడ్
పెళ్లి చేసుకుందామని శ్రద్దా పదేపదే ఒత్తిడిచేసింది. మద్యం సేవించి ఇంటికి వెలుతున్న అఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను చితకబాదడం మొదలు పెట్టాడు. కుటుంబ సభ్యులు తన భాదలు చెప్పుకోలేని శ్రద్దా ఆమె స్కూల్ ఫ్రెండ్ లక్ష్మణ్ కు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి చేసుకుందామని శ్రద్దా పదేపదే ఒత్తిడి చెయ్యడంతో ఆమెను చంపేయాలని అఫ్తాద్ డిసైడ్ అయ్యాడు.

ప్రియురాలిని 35 ముక్కలు చేశాడు
అఫ్తాబ్ 300 లీటర్ల ఫ్రిజ్ ఒకటి తీసుకు వచ్చి అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో పెట్టాడు. మే 18వ తేదీ అర్దరాత్రి శ్రద్దా, హఫ్తాద్ ల మద్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ సందర్బంలో ప్రియురాలు శ్రద్దాను హత్య చేసిన హఫ్తాద్ ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. శ్రద్దా శరీరంలోని ముక్కలు ప్లాస్టిక్ కవర్లలో వేసి వాటిని ఫ్రిజ్ లో పెట్టాడు.

అమెరికా సెంట్, అగరబత్తీలు
దుర్వాసన బయటకు రాకుండా ఆమెరికా కంపెనీకి చెందిన ఫర్ఫూమ్ చల్లుతూ అగరబత్తిలు వేలిగించడం మొదలుపెట్టాడు. అర్దరాత్రి 2 గంటల తరువాత ప్రియురాలు శరీరంలోని ముక్కలు కొన్ని బయటకు తియ్యడం, సమీపంలోని అటవి ప్రాంతంలో విసిరేయడం చేశాడు. ఇలా 18 రోజుల పాటు ప్రియురాలు శ్రద్దా శరీరంలోని 35 ముక్కలు అటవి ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసి అపార్ట్ మెంట్ ఖాళీ చేసుకుని వెళ్లిపోయాడు.

సైకో సీరియల్ కిల్లర్ సినిమాలు చూసి ?
శ్రద్దా తండ్రి కేసు పెట్టడంతో కొన్ని నెలల తరువాత శాడిస్టు హఫ్తాబ్ పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసుల విచారణలో హఫ్తాబ్ కలకలం రేపే విషయాలు చెప్పాడు. సైకో సీరియల్ కిల్లర్ డెక్ట్సర్ చూసి తాను అచ్చం సీరియల్ ల్లోలాగే చేసి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించానని ప్రియుడు హఫ్తాబ్ ఢిల్లీ పోలీసులకు చెప్పాడు. అయితే సైకో సీరియల్ కిల్లర్ సినిమాలో హంతకుడు అతను హత్య చేసిన వ్యక్తుల శరీరం ముక్కలు కుక్కలకు వేస్తే హఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దా శరీరంలోని ముక్కలు అటవి ప్రాంతంలో వేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications