Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఫోన్లలో పనిచేయని పబ్‌జీ, స్పాటిఫై, టిండర్‌ యాప్స్.. సడెన్ క్రాష్, ఏమైంది?

ఐఫోన్‌లలో పలు ప్రముఖ యాప్స్ పనిచేయడం లేదు. ఇందులో పబ్‌జీ మొబైల్, స్పాటిఫై. టిండర్, పింట్రెస్ట్‌తో సహా మరిన్ని యాప్స్ ఐఓఎస్‌పై క్రాష్ అయ్యాయి. దీంతో ఐఓఎస్ యూజర్లు ఈ యాప్స్‌ను పొందలేకున్నారు. యాప్స్ క్రాష్ అయిన ప్రతిసారి తిరిగి లాంచ్ అవుతుండటం, తిరిగి క్రాష్ అవుతుండటం జరుగుతోంది.

పబ్‌జీ మొబైల్ స్పాటిఫై యాప్‌లు డౌన్ ?
పబ్‌జీ మొబైల్, స్పాటిఫై, పిన్‌టె‌రెస్ట్‌లాంటి యాప్స్ యూజర్లకు డౌన్ అయినట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ యాప్స్ ఒక్కసారిగా డౌన్ అవడం వెనక కారణమేంటనేదానిపై స్పష్టత లేదు. అయితే దీని వెనక ఫేస్‌బుక్‌కు చెందిన ఎస్‌డీకే అయి ఉండొచ్చని సమాచారం. చాలామంది ఈ యాప్స్‌కు లాగిన్ అవ్వాలంటే ఎస్‌డీకే ద్వారానే లాగిన్ అవుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సమస్య గురించి తమకు తెలుసని ఫేస్‌బుక్ గిట్‌హబ్ పై చేసిన పోస్టు ద్వారా పేర్కొంది.

PUBG Mobile, Spotify, Tinder and more not working for iOS users: Know what is it

ఐఓఎస్ యూజర్లు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రయత్నిస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అయితే డౌన్ అయిన ఈ యాప్స్‌ చాలా పాపులర్ కావడంతో ఈ సమస్య గురించి చెప్పేందుకు యూజర్లు ట్విటర్‌‌ను ఆశ్రయిస్తున్నారు. స్పాటిఫై హాష్‌ట్యాగ్‌ (#Spotify)కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇదే సమస్యను ఎదుర్కొన్న పబ్‌జీ మొబైల్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించింది.

Recommended Video

    A Man Used Hundreds Of iPhones For A Wall,Video Gone Viral

    ఫేస్‌బుక్ ఎస్‌డీకే‌ను వినియోగిస్తున్న ఐఫోన్ యాప్స్ క్రాష్ అవుతున్నాయని కొందరు యూజర్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఫేస్‌బుక్ దీనిపై ఇంకా స్పందించాల్సి ఉందని పోస్టు చేశారు. చాలామంది తాము ఎదుర్కొంటున్న సమస్యలను ట్విటర్ ద్వారా చెప్పారు. ప్రముఖ యాప్స్ స్పాటిఫై, పిన్‌టెరెస్ట్, టిండర్‌లాంటి చాలా యాప్స్ ఐఫోన్‌లో పనిచేయడం లేదని మరికొందరు నెటిజెన్లు చెప్పారు. పబ్‌జీ మొబైల్‌ తన ఐఫోన్ 7లో ఓపెన్ కావడం లేదని మరికొందరు నెటిజెన్లు ట్విటర్‌లో వీడియోను పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఈ సమస్య ఆండ్రాయిడ్ యూజర్లకు తలెత్తడం లేదని ఒక్కసారి సమస్యకు పరిష్కారం దొరికితే తిరిగి అప్‌డేట్ చేస్తామని పబ్‌జీ సంస్థ స్పష్టం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+