పీకలదాకా తాగిన పోలీసు, మహిళను పక్కకు పిలిచాడు, బూతులు, చివరికి స్థానికులు !

పట్టపగలు పీకలదాక మద్యం సేవించిన పోలీసుయూనీఫాంలో ఉన్నానని రెచ్చిపోయాడు, బూతులుమహిళ చెయ్యి పట్టుకుని పక్కకు పిలిచాడు, చివరికి స్థానికులు !

బెంగళూరు: పీకలదాకా మద్యం సేవించిన పోలీసు స్థానికులను బూతులు తిట్టాడు. అటుగా వెలుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చెయ్యి పట్టుకుని పక్కకు వస్తావా అంటూ అడిగాడు. కానిస్టేబుల్ చేష్టలు తారాస్థాయికి చేరడంతో అతన్ని స్థానికులు పట్టుకుని చితకబాదేశారు.

కర్ణాటకలోని గదగ్ జిల్లా కేంద్రంలో జిల్లా రిజర్వు పోలీసుగా ఉద్యోగం చేస్తున్న చంద్రు లమాణి పట్టపగలు పీకలదాకా మద్యం సేవించాడు. తరువాత గదగ్ నగరంలోని ముళగుందనాకా ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో స్థానికుల మీద విరుచుకుపడ్డాడు.

Public beats drunken police constable Chandru in Karnataka

పోలీసు యూనీఫాం వేసుకున్న చంద్రు లమాణిని కొందరు చూసిచూడనట్లు వదిలేశారు. పోలీసు యూనీఫాంలో ఉన్న తనను ఎవ్వరూ ఏమీ చేసుకోలేరని చంద్రు భావించాడు. మద్యం మత్తు నసాలానికి ఎక్కడంతో చంద్రు మరింత రెచ్చిపోయాడు.

స్థానికులను బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. అటు వైపు వెలుతున్న మహిళ చెయ్యి పట్టుకుని పక్కకు వస్తావా అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుల్ చంద్రు చేష్టలు సృతిమించడంతో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదేశారు. మద్యం మత్తు దిగే వరకు దాడి చేశారు.

కానిస్టేబుల్ చంద్రు మీద దాడి చేసే సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అయ్యింది. మంగళవారం కానిస్టేబుల్ చంద్రు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంత జరిగినా పోలీసులు మాత్రం చంద్రు మీద ఇంకా కేసు నమోదు చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+