రైల్వే స్టేషన్ వాటర్ ట్యాంక్ లో కోతుల జలకాలాటలు: తాగితే పోతార్రోయ్
ఓ రైల్వే స్టేషన్‌లోని వాటర్ ట్యాంకులను కొన్ని కోతులు కలుషితం చేసిన సంఘటన ఇది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైల్వే స్టేషన్ రూఫ్‌పైన ఉన్న ప్లాస్టిక్ ఓపెన్ వాటర్ ట్యాంకుల్లో కోతులు స్నానం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇది చూడ్డానికి సరదాగా అనిపించినా.. వేలాదిమంది ప్రయాణికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందనే ఆందోళనలు రేకెత్తిస్తోంది.
ఓ కోతి వాటర్ ట్యాంక్ లోపల స్నానం చేస్తుండగా, మరో రెండు కోతులు దానిపై కూర్చొని ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. రైల్వే స్టేషన్ల నిర్వహణలో చోటు చేసుకుంటోన్న లోపాలను మరోసారి బహిరంగం చేసినట్టయిందీ ఉదంతంతో. రైల్వే అధికారులు, సిబ్బంది తక్షణమే ఈ ట్యాంకులను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా యూజర్లు సూచిస్తోన్నారు.

ఓపెన్ వాటర్ ట్యాంకులు పెట్టడమే తప్పని, పైగా దీన్ని పర్యవేక్షించకుండా అలాగే వదిలేయడం సరికాదని అంటున్నారు. రైల్వే స్టేషన్ నీటి ట్యాంకుల్లో కోతులు హాయిగా స్నానం చేస్తున్నాయని, ఇలాంటి ఘటనల పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు. ఆ నీటిని ప్రయాణికులు తాగితే ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలని అంటున్నారు.
ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో కోతులకు ఫ్రీ జాకుజీ.. ప్రయాణికులకు ఫ్రీ కామెర్లు" అని ఓ యూజర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. "అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనం లేకపోవడమే దీనికంతటికీ మూల కారణమని స్పష్టం చేస్తోన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగేంత వరకు ఇటువంటి వాటికి ఎవరూ బాధ్యత వహించరు" అని మరొకరు వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్ కూల్ వాటర్ సిస్టమ్ నుండి వాటర్ బాటిల్ ను నింపుకొని తాగినప్పుడు మంకీ ఫ్లూ లేదా ఏదైనా జబ్బు సోకవచ్చు.. అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు.
Monkeys are literally chilling in water tanks at railway station.
— Anuradha Tiwari (@talk2anuradha) September 28, 2025
Could anything this disgusting ever happen in a private building?
Imagine the deadly diseases waiting to spread.
Not a single government department works. They only collect salaries, bribes & pension. pic.twitter.com/a92wTp6KjH
"రైల్వే స్టేషన్లల్లో మంచినీరు తాగకుండా జాగ్రత్త పడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సురక్షితంగా ఉండండి. సకాలంలో పన్నులు చెల్లించడం మాత్రం మర్చిపోవద్దు, లేకపోతే మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది" అని మరో యూజర్ సెటైర్లు వేశాడు. "రైల్వేలు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ, వారి సొంత స్టేషన్లలో సురక్షితమైన తాగునీటిని అందించలేకపోవడం విడ్డూరమని, జవాబుదారీతనం, ఆడిట్, జరిమానాలు, రియల్ టైమ్ మేనేజ్మెంట్ వల్లే ఆయా సమస్యలు పరిష్కారమౌతాయని ఇంకొకరు అభిప్రాయపడ్డారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications