గౌతమి హత్య కేసు: నిందితుడు మహేష్ గాడ్సే, ఎల్‌టిటిఈ పుస్తకాలు చదివాడు

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ప్రగతి కాలేజ్ విద్యార్థిని గౌతమి (18)ని హత్య చేసిన మహేష్

గురించి రోజుకు ఒక కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అతను సమయం చిక్కినప్పుడు మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సే జీవిత చరిత్ర గురించి చదివేవాడు

గాంధీని ఎందుకు చంపవలసి వచ్చింది, గాడ్సే లక్ష్యం ఏమిటనే పూర్తి వివరాలు తెసుకున్నాడు. అదే విధంగా శ్రీలంకకు చెందిన ఎల్ టీటీఇ నాయకులు, వారి కార్యకాలాపాల గురించి పుస్తకాలు చదివి వివరాలు తెలుసుకున్నాడని పోలీసులు గుర్తించారు.

ఎల్ టీటీఇ నాయకులు ఎందుకు పోరాటం చేశారనే విషయంపై ఆసక్తిగా అధ్యయనం చేశాడని పోలీసులు అన్నారు. ఇప్పటికే మహేష్ కు నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయని బెంగళూరు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

puc student gauthami murder case investigation in bihar

గౌతమిని హత్య చెయ్యడానికి ఉపయోగించిన పిస్తోల్ ను మహేష్ బీహార్ లో కొనుగోలు చేశాడని పోలీసులు వివరాలు సేకరించారు. గత శనివారం మహేష్ ను పోలీసులు బీహార్ తీసుకు వెళ్లారు. బీహార్ పోలీసుల సహకారంతో ముంగూర్ జిల్లాలో మహేష్ కు రివాల్వర్ విక్రయించిన వ్యక్తిని గుర్తించారు.

నాలుగు సంవత్సరాల క్రితం మహేష్ బీహార్ లో రూ. 6 వేలు చెల్లించి పిస్తోల్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలుసుకున్నారు. మహేష్ కు తానే పిస్తోల్ విక్రయించానని బీహార్ వ్యక్తి అంగీకరించలేదని పోలీసులు అంటున్నారు. అతను నాటు పిస్తోల్ లు తయారు చేసి విక్రయిస్తాడని స్థానిక పోలీసులు సమాచారం అందించారని బెంగళూరు పోలీసులు చెప్పారు.

మంగళవారం మహేష్ ను బీహార్ నుండి బెంగళూరు తీసుకు వచ్చారు. దర్యాప్తు చివరి దశలో ఉందని ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించడం వీలుకాదని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ అంటున్నారు. మహేష్ ను బీహార్ తీసుకు వెళ్లి విచారణ చేసి తీసుకు వచ్చామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+