తమిళనాడు ఎమ్మెల్యేలు రిసార్ట్ లో: పోలీసుల దాడులు, మర్యాదగా వెళ్లిపోండి, వార్నింగ్ !

పుదుచ్చేరి సమీపంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాపై స్థానిక పోలీసులు దాడులు చేశారు. రిసార్ట్ లో ఉన్న టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పుదుచ్చేరి పోలీసులు .

పుదుచ్చేరి: పుదుచ్చేరి సమీపంలోని ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాపై స్థానిక పోలీసులు దాడులు చేశారు. రిసార్ట్ లో ఉన్న టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పుదుచ్చేరి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

దినకరన్ గ్రూప్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు నుంచి పుదుచ్చేరి వచ్చారని, పక్కా రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడి నుంచి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారని, ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు ఏర్పడుతాయని స్థానిక మాజీ శాసన సభ్యుడు (అన్నాడీఎంకే) ఓం శక్తి సాగర్ బుధవారం ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

 Puducherry police are conducting a review at the hotel where Dinakaran's support MLAs

ఫిర్యాదు స్వీకరించిన పుదుచ్చేరి పోలీసులు గురువారం మద్యాహ్నం ద వైండ్ ఫ్లవర్ రిసార్ట్ స్పాలోకి అడుగుపెట్టారు. వెంటనే ఇక్కడి రిసార్ట్ నుంచి ఖాళీ చేసి వెళ్లి పోవాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు పోలీసులు కొన్ని గంటలు గడుపు ఇచ్చారు.

అక్కడి నుంచి తాము వెళ్లేదిలేదని, మా ఇష్టప్రకారం రిసార్ట్ కు వచ్చామని ఎమ్మెల్యేలు పోలీసులతో గొడవపడ్డారు. పుదుచ్చేరి పోలీసులు మాత్రం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పంపించేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+